15, ఏప్రిల్ 2022, శుక్రవారం

ధనం ప్రారబ్ధాను సారముగా లభిస్తుంది

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳 నిజానికి ధనం ప్రారబ్ధాను సారముగా లభిస్తుంది.ఇచ్ఛామాత్రం చేత కాదు.(కోరుకున్నంత మాత్రాన)రాదు.డబ్బే కనుక కోరినంత మాత్రాన లభించేటట్లయితే నిర్ధనుడంటూ ఎవడూ ఉండరు.ధనేచ్ఛ ఎప్పుడూ ఎవరికీ తీరలేదు.తీరదు.తీరజాలదు కూడా.దానినైతే త్యజించవలసిందే.ధనం లభించేది అయితే కోరకుండానే తేలికగా లభిస్తుంది.కోరితే కఠినంగానూ పాపపూర్వకంగానూ,అన్యాయంగానూ వస్తుంది.గీతలో అర్జునుడు --మనుష్యుడు తాను కోరకుండానే పాపం ఎందుకు చేస్తూంటాడు అని అడుగుతాడు.భగవంతుడు ------కామనయే(కోరిక -వాంఛ) అన్ని పాపాలకి మూలమన్నాడు.(గీత.3/36,37)🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳

కామెంట్‌లు లేవు: