15, ఏప్రిల్ 2022, శుక్రవారం

భగవద్గీత

 🌹భగవద్గీత🌹

       

పదమూడవ అధ్యాయము

క్షేత్ర - క్షేత్రజ్ఞవిభాగయోగము 

నుంచి 18 వ శ్లోకము


ఇతి క్షేత్రం తథా జ్ఞానం 

జ్ఞేయం చోక్తం సమాసతః ౹

మద్భక్త  ఏతద్విజ్ఞాయ

మద్భావాయోపపద్యతే ౹౹(18)


ఇతి , క్షేత్రమ్ , తథా , జ్ఞానమ్ ,

జ్ఞేయమ్ , చ , ఉక్తమ్ , సమాసతః ౹

మద్భక్తః , ఏతత్ , విజ్ఞాయ ,

మద్భావాయ , ఉపపద్యతే ౹౹(18)


ఇతి = ఈ విధముగా 

క్షేత్రమ్ = క్షేత్రమును గూర్చియు 

జ్ఞానమ్ = జ్ఞానమును గూర్చియు చ = మఱియు 

జ్ఞేయమ్ = తెలిసికొనదగినపరమాత్మ స్వరrooపమును గూర్చియు 

సమాసతః = సంక్షిప్తముగా 

ఉక్తమ్ = చెప్పబడినది 

మద్భక్తః = నా భక్తుడు 

ఏతత్ , విజ్ఞాయ = దీనినే సమగ్రముగా తెలిసికొని 

మద్భావాయ = నా స్వరూపమునే 

ఉపపద్యతే = పొందును .


తాత్పర్యము:- ఇంతవఱకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు , జ్ఞేయమును (తెలిసికొనదగిన పరమాత్మ స్వరూపమును) గుఱించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా  తెలిసికొనిన నా భక్తుడు నాస్వరూపమునే పొందును. (18)


           ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                    Yours Welwisher

    Yennapusa Bhagya Lakshmi Reddy

కామెంట్‌లు లేవు: