5, డిసెంబర్ 2024, గురువారం

నటరాజ స్వామి

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శివుడి ఆనందతాండవము*

          *నటరాజ స్వామి*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*"నట" అనే ధాతువుకు స్పందించడమని అర్ధం. తన భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తేందుకు స్వామి అనేక సంధర్బాలలో నాట్యం చేసినట్టు పురాణవచనం. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటారు అనేది విదితం. గజాసురుణ్ణి సంహరించినప్పుడు,అంధకాసుర సంహరించినప్పుడు శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.*


*స్వామి నాలుగు చేతులలో నెమలి ఈకలు కట్టిన జడలతో, ఆ జడలలో ఒక సర్పం, ఒక కపాలం, గంగ, దానిపై చంద్ర రేఖ, కుడి చెవికి కుండలం, ఎడమ చెవికి తాటంకం , కంఠహారాలతో, నూపురాలతో, కేయూరాంగదాలతో, యఙ్ఞోపవీతంతో, కుడి చేతిలో ఢమరుకం ,మరొక కుడిచేయి అభయ ముద్రను ప్రకటించడం, ఒక ఎడమ చేతిలో అగ్ని,మరొక చేయి సర్పాన్ని , చేతిలో పెట్టుకున్న మూలయకుణ్ణి చూపిస్తూ, ఎడమకాలు ఎత్తి పెట్టబడినట్లుగా, విగ్రహానికి చుట్టూ ఓ కాంతి వలయం, పద్మాకారంగ చెక్కబడిన పీఠంపై నృత్యం అద్భుతం.*


*చెవి కుండలములు – అర్ధనారీశ్వరతత్వము*


*వెనుక కుడి చేతిలో డమరుకం – శబ్దబ్రహ్మయొక్క ఉత్పత్తి*


*వెనుక ఎడమ చేతిలో అగ్ని – చరాచరముల శుద్ధి*


*ముందు కుడి చేయి – భక్తులకు అభయము*


*ముందు ఎడమ చేయి – జీవులకు ముక్తి హేతువయిన పైకి ఎత్తిన పాదమును సూచించును.*


*కుడి కాలుకింద ఉన్న అపస్మార పురుషుడు (ములయక రాక్షసుడు) – అఙ్ఞాన నాశనము*


*చక్రము – మాయ*


*చక్రమును స్పృశించిన చేయి – మాయను పవిత్రము చేయ్తుట*


*చక్రమునుండి లేచు 5 జ్వాలలు – సూక్ష్మమైన పంచతత్వములు.*


*నాట్యం చేస్తున్నప్పుడు నటరాజుకు నాలుగు భుజాలు ఉంటాయి.ఆయన చేసే నృత్యాలు ఏడు రకాలుగా ఉంటాయి.*


*1) ఆనంద తాండవం*

*2) ప్రదోష నృత్యం ( సంధ్యా తాండవం)*

*3) కాళితాండవం*

*4) త్రిపురతాండవం*

*5) గౌరి తాండవం*

*6) సంహార తాండవం*

*7) ఉమా తాండవం*


*గౌరి ,ఉమా తాండవాలలో శివుని రూపం భైరవముగా ఉంటుంది. ఆయన సాత్విక నృత్యం ప్రదోషకాల నృత్యమే. అందుకే ప్రదోషకాలంలో శివపూజ ప్రశస్తమైనది.*


*అసలు భూలోకంలో ఉన్న నృత్యరూపాలు అన్ని ఆయన నృత్యంలో నుండి ఉద్భవించినవే!ఆయన తన నృత్యమును, పార్వతి ద్వారా అభినయింప జేసి, తమ నాట్యాన్ని భరతమునికి చూపించగా, భరత ముని ద్వారా నాట్య వేదం రూపుదిద్దుకుందంటారు.*


*సంహారకరమైన శివుని ఉగ్రనృత్యములందు జగత్తును ప్రళయం గావించి,జీవుల కర్మబంధమును కూడా నశింపచేయును.*

*ఆనంద తాండవమునందు శివుని ముద్రల అంతార్ధము ఇదే. ఆయన తాండవము లోకరక్షాకరం.*


*ఓం శ్రీ చిదంబరేశ్వరాయ నమః।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

కామెంట్‌లు లేవు: