🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పంచాక్షరీ రహస్యం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పంచాక్షరి మంత్రాలు:~*
*స్థూలపంచాక్షరి (నమశ్శివాయ),*
*సూక్ష్మ పంచాక్షరి (శివాయ నమః),*
*కారణ పంచాక్షరి (శివాయ శివ),*
*మహాకారణ పంచాక్షరి (శివాయ),*
మహామను లేదా ముక్తి పంచాక్షరి (శి).*
*నమః అంటే నమస్కారము.*
*శివాయ నమః అంటే శివభగవానునకు నమస్కారములు..*
*దేహదృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడు..*
*'నమః' జీవాత్మను సూచిస్తుంది.*
*'శివ' అనేది పరమాత్మను సూచిస్తుంది.*
*'ఆయ' అనేది ఐక్యాన్ని లేదా జీవాత్మ, పరమాత్మల ఉనికిని సూచిస్తుంది.*
*అందుకే శివాయ నమః అనేది..
జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే 'తత్త్వమసి' లాంటి మహావాక్యం.*
*ఓం...*
*ప్రణవం అనేది భగవంతుని (వడ్లగింజ)*
*బాహ్యరూపం (పొట్టు) మరియు*
*పంచాక్షరి అనేది అంతఃస్వరూపం (బియ్యపు గింజ).*
*ప్రణవము మరియు పంచాక్షరి ఒక్కటే.*
*ఐదు అక్షరాలు..భగవానుని ఐదు కర్మలను సూచిస్తాయి.,అవి ఏమిటంటే.*
*సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం.*
*అవి పంచభూతాలను మరియు వాటి కలయికతో ఏర్పడిన సమస్త సృష్టిని/ జీవాలను సూచిస్తాయి.*
*ఓం నమః శివాయ.*
*లోకా సమస్తా సుఖినోభవంతు.*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి