10-31-గీతా మకరందము
విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి
స్రోతసామస్మి జాహ్నవీ ||
తా:- నేను పవిత్రమొనర్చువారిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.
వ్యాఖ్య:- ఈ శ్లోకమందు తెలుపబడినరీతి గంగానది సాక్షాత్ భగవత్స్వరూపమే. కావున అది మహాపవిత్రముగ, పాపహారకముగ నెన్నుకొనబడుచున్నది. కృష్ణుడు తాను రాముడేయని వచించుటవలన రామకృష్ణు లిరువురును ఒకే భగవత్స్వరూపమని స్పష్టమగుచున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి