కీర్తి - ఆర్తి - మూర్తి - స్ఫూర్తి. (దత్తపది)
*సజ్జన స్వభావము (స్వేచ్ఛా ఛందము*)
కీర్తినెప్పుడు గోరకుండును కీడు సేయడు నెప్పుడున్
ఆర్తిబాపునె నన్ని వేళల నాదుకొంటయె దీక్షయౌ
మూర్తిమత్వము ధర్మదేవత ముందునుండుట జూడమే
స్ఫూర్తి నిచ్చును తోటివారికి సోముడే దిగివచ్చెనో
పూర్తి సజ్జన విగ్రహంబును పోల్చ రాదుగ యేరికిన్.
అల్వాల లక్ష్మణ మూర్తి
: *అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే*
*ఆంగ్లేయుడు*
ఈ సమస్యకు నాపూరణ.
రవియే గ్రుంకని సార్వభౌమతను మీరారాధనల్ సేయరే
వ్యవసాయంబును వృద్ధి జేసితి మిటన్ వ్యక్తంబుగాన్ జూడవే
అవధానంబను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే
*తెలుగు భారతీయుడు*
అవకాశంబులు నన్ని హక్కులును మావై యుండగా ప్రేలుటా!
భువిలో ముందుగ నాగరీకులములే పూర్వమ్ము మా గొప్పలే.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి