6, జూన్ 2023, మంగళవారం

ఆలంకారిక చమత్కారం!

 ప్రాచీన కవుల ఆలంకారిక చమత్కారం!


చం.కినిసికుచాననాంగ రుచి గిన్నెలతో నెలతో లతోన్నతిన్


ఘన కచ కంఠ రూపము లు కందరమై దరమై రమైక్యమై


గొనబగు వాక్కటీక్షలటు కోయిలకో యిలకో లకోరికో


వనితనొసల్ వళుల్ నడుము బాలహరిన్ లహరిన్ హరిన్ నగున్.


అహల్య వర్ణన.

 క్రమాలంకారము.కుచాననాంగ రుచి గిన్నెలతో. గితొలగిన నెలతో, నె తొలగిన లతో.అవుతుంది.ఇదే విధముగా మిగిలిన పాదములలో (ఉపమలను) ఒకొక్క అక్షరము తొలగించిన అర్థములు వచ్చును. 

కఠిన పదములకు అర్థములు.కచ=వెంట్రుక లు (కురులు) కందరము=గుహ,(గుహలోపల గాడాంధకారము ఉంటుంది)దరము =శంఖము,రమైక్యమై =అందమైన,లకోరిక=బాణము,బాలహరి= బాల చంద్రుడు,లహరి=సముద్రపుఅలలు, హరి=సింహము.

భావము:--అహల్య స్తనములు గిన్నెల వలె,ముఖము చంద్రుని వలె,శరీరము నున్నగా (మృదువుగా) సన్నగాను,కురులు నల్లగా,మెడ సన్నని శంఖము వలె, రూపము మనోహరముగా,మాటలు కోయిల వలె, పిరుదులు పెద్దవి (భూగోళములవలె,)

చూపులు బాణములవలె,నొసలు బాల చంద్రునివలె,కడుపుమీది ముడతలు సముద్రపు అలలు వలె,నడుము సింహము వలెఉన్నది. అద్భుత వర్ణన.

రచన:--- సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు


అహల్యా సంక్రందనముకావ్యములోనిది.

సేకరణ:--పి.మోహన్ రెడ్డి.

కామెంట్‌లు లేవు: