6, జూన్ 2023, మంగళవారం

కురువంశ పాలకులు -

 కురువంశ పాలకులు -






భారత  దేశాన్ని పాలించిన కురు వంశం మహా భారత యుద్ధం తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడనీ  అందరికీ తెలుసు. కలి శక పూర్వం ధర్మరాజు  ముప్పది ఆరేళ్ళు ధర్మపాలన చేశారు. పిమ్మట అభిమన్యుని కుమారుడు అయిన పరీక్షిత్తును  పట్టాభిషిక్తుని  చేసారు .     పరీక్షిత్తు కలిశకం ఆరంభమయిన బిఫోర్ కామన్ ఎరా  3101  నుండీ బిఫోర్ కామన్ ఎరా 3041  వరకు  దాదాపు  అరువది ఏళ్ళు పరిపాలించాడు . సర్పదష్టుడై పరీక్షిత్తు మరణం తర్వాత అతని కుమారుడు జనమేజయుడు పాలనకు వచ్చాడు. జనమేజయుని తర్వాత వచ్చిన కురువంశ రాజులు అంత  చాకచక్యం కలవారు, దక్షత కలవారు కారు . పిమ్మట భారత దేశం మగధ రాజధానిగా జరాసంధుని వంశం అయిన బార్హద్రధ వంశము పాలనలోకి వెళ్ళింది . వారే చక్రవర్తుల అయ్యారు. కురు వంశ పాలకులు సామంతులు అయ్యారు. ఆ పాలకులు దాదాపు 29  మంది హస్తినాపురం రాజధానిగా  మగధకు సామంతులుగా పరిపాలించారు. జనమేజయుని తర్వాత పాలనకు  వచ్చిన  పాలకుల పేర్లు 


శతానీకుడు

అశ్వమేధాదత్త 

అధిసింహ కృష్ణ

నిచక్ను 

ఉష్ణ 

చిత్ర రధుడు 

శుచి రధుడు 

వృష్ణి మంతుడు 

సుషేణుడు 

సునీధ

నృపేగాక్షు

శుఖిబల  

పరిప్లవ 

సునయ

మేధావి 

రిపుంజయ 

ఉర్వ 

తిగ్మ 

బృహద్రథ 

కసూదన

శతానీక 2 

ఉదయన

కిహినార 

దండపాణి 

నిరామిత్ర 

క్షేమకుడు 

 

ఈ కురు వంశ పాలకులు మహా భారత యుద్ధానంతరం మొత్తం 1504  సంవత్సరాలు పరిపాలించారు . బిఫోర్ కామన్ ఎరా  1634  లో  క్షేమకునితో కురువంశ పాలన అంతమైంది .  జనమేజయుని తర్వాత  వచ్చిన పాలకులు తమ రాజ్యములో ఒక్కో ప్రాంతాన్ని కోల్పోతూ వచ్చారు . ఉదయనుని కాలములో వారు వత్స దేశాన్ని కోశాంబి రాజధానిగా పాలిస్తున్నాడన్న కథ మనకు  భాస కవీంద్రుడు రచించిన స్వప్న వాసవ దత్తము ద్వారా సుపరిచితమే.. ఉదయనుడు కురు వంశానికి చెందిన పాలకుడే.

కామెంట్‌లు లేవు: