6, జూన్ 2023, మంగళవారం

సాదాకా మేలుకో -3 బాటసారులు

సాదాకా మేలుకో -3

 బాటసారులు 

ఒక ప్రదేశంలో ఒక చక్కటి శాఖలు కలిగిన వటవృక్షం కనపడితే వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాటసారులు ఎండలో నడిచి అలసి ఉన్నందున కొంత తడవు విశ్రాంతి తీసుకొని మరల ప్రయాణం చేద్దామని ఆ చెట్టుక్రిందకు వచ్చారట. అక్కడకు వచ్చిన వారికి ఒకరిగురించి ఇంకొకరికి ఇంతకు ముందు తెలియదు విశ్రాంతి తీసుకుంటూ ఒకరి గురించి ఇంకొకరు పరిచయం చేసుకున్నారు. ఒకరి వద్ద తెచ్చుకున్న త్రాగే నీరు ఇంకొకరు అలాగే ఒకరి వద్ద వున్న భోజనము ఇంకొకరు ఎంతో ఆప్యాయంగా పంచుకొని  భుజించారట. నిజానికి వారిలో ఏ ఒక్కరు కూడా ఇంకొక్కరికి ఏమి కారు  వారి అందరి సమిష్టి అవసరం ఎండలో కొంత తడువు వృక్ష ఛాయలో విశ్రాంతి తీసుకోవటమే. ఒక్కొక్కరు ఇంకొక్కరి గురించి తెలుసుకొని పిచ్చాపాటిగా సంభాషణలు చేసుకొన్నారు. కొంత ఎండ తీవ్రత తగ్గగానే ఒకరి వెంట ఇంకొకరు బయలు దేరి ఆ చెట్టును వదిలి తమ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తక్కువ అలసట చెందిన వారు ముందుగా కొంచం ఎక్కువగా అలసట చెందినవారు మరికొంత సమయం తరువాత ఆ చెట్టు నీడను వదిలి పయనమయ్యారు. సాయంత్రం అయ్యేసరికి ఒకరితరువాట్ ఒకరుగా చెట్టును వదిలి వెళ్లారు. ఆ తరువాత ఒక బాటసారికి ఇంకొక బాటసారి  కలవడు. అదే విధంగా ఒక బాటసారి ఇంకొక బాటసారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండడు.  వారి స్నేహం కేవలం కొద్ది సమయం మాత్రమే. 

ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ఈ భూమి మీద మన పయనం కూడా ఒక బాటసారి పయనానికన్నా ఏమి భిన్నంగా లేదు. కానీ మనం ఇదే శాశ్వితం అనుకోని ఇక్కడే మనం సదా ఉంటామని అనుకోని మనం జీవనాన్ని గడుపుతుంటాము.  నిజానికి ఈ చెరా చెర జగత్తులో ఏది ఎవిరిది కాదు ఏది శాశ్వితం కాదు.  శాశ్వితం అయినది చేరుకోవలసినది అయినది కేవలం అంటే కేవలం బ్రహ్మ పధం మాత్రమే.  కాబట్టి మనం ఆలస్యం చేయకుండా ఈ క్షణం నుంచె మన సాధనను మొదలు పెట్టి మన దృష్టిని నిత్యమైనది, సత్యమైనది, శాశ్వితమైనది అయిన ఆ బ్రహ్మ పదాన్ని చేరటానికి సదా ప్రయత్నించాలి. 

నేను గృహస్తును నాకు అనేక బంధాలు, బాధ్యతలు వున్నాయి అనే భ్రాంతిలో ఉండకండి.  నిజానికి నీవు బంధాలు అనుకునేవి ఏవి బంధాలు కావు.  నీవు బాధ్యతలు అనుకునేవి కూడా నీ బాధ్యతలు కావు కేవలం అవన్నీ నీవు నీయంతటఁ కలిపించుకున్నవి మాత్రమే వాటన్నిటిని ఒక్కసారి చూడు తప్పకుండ అవి నీ కన్నా బిన్నంగా గోచరిస్తాయి. నిజానికి నీవు అనుకునే ప్రతి బంధము, బాధ్యత నీ దేహంతోటే ముడిపడి వుంది నీవు ఎంతవరకు నీ దేహమే నీవు అనుకుంటావో అంతవరకూ నీవు వాటినుండి విడి వడలేవు. సాధక మేలుకో నీవు దేహానివి కావు దేహంలో నిగూఢంగా నిక్షిప్తమై వున్న  దేహివి. ఈ విషయం తెలుసుకున్న నీకు ఈ దేహం కేవలం ఒక ఉపకరణం లాగ మాత్రమే గోచరించి ఈ దేహంతో నీవు సాధించాలిసిన నీ కర్తవ్యం నీకు గోచరిస్తుంది. అప్పుడు నీకు నీ బంధాలలో వేటిలో నీవు లేవనే సత్యం గోచరిస్తుంది. అప్పుడు  వేటిలోను నీవు కర్త్రుత్వం తీసుకోకుండా అన్ని కర్మలు నెరవేర్చగలుగుతావు.  కేవలం నీ కర్తవ్యం మోక్షపడాన్ని చేరటమే అని సదా తలుస్తావు. ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పటినుండే నీ సాధనను మొదలిడి శాశ్వితమైన బ్రహ్మపదాన్ని చేరే జిగ్న్యాసివిగా మారిపో.  

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: