6, జూన్ 2023, మంగళవారం

విద్యాశంకర_దేవాలయం

 శుభోదయం🙏


విద్యాశంకర_దేవాలయం


సంస్కృతీ వైభవం!!


 ఇది అద్భుతాలలో అద్భుతం అని చెప్పొచ్చు. ఈ దేవాలయం 12 స్తంభాలతో ఉంటుంది. వాటి మీద సూర్యుడి శాసనాలు ఉంటాయి.


ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు పడగానే. అందులోని ప్రత్యేక స్థంభం దానికి సంబంధించిన నెలను, సంవత్సరాన్ని చూపిస్తుంది.


శ్రింగేరి పర్యాటకులు విద్యా శంకరులు కల దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ యాత్రా స్ధలం విద్యారణ్య స్వామి అనే రుషి చే విజయనగర రాజుల కాలంలో  1338లో నిర్మించబడింది. దేవాలయం ద్రవిడ, చాళుక్య, దక్షిణ భారత మరియు విజయనగర శిల్ప శైలులు ప్రదర్శిస్తుంది. దీనిపై అనేక శిలా శాసనాలు విజయనగర రాజ్యానికి సంబంధించి చూడవచ్చు. నలుచదరం కల ఈ దేవాలయానకి 12 స్తంభాలు కలవు. ఇవి 12 రాసులను తెలుపుతాయి.


 లోపలి భాగంలో దుర్గామాత, విద్యా గణేశ విగ్రహాలుంటాయి. విగ్రహాలే కాకబ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర దేవతలు కూడా అందమైన విగ్రహాలుగా రూపొందించబడ్డాయి. దేవాలయంలోని సీలింగ్ అందమైన శిల్ప చెక్కడాలు ప్రదర్శిస్తుంది. దేవాలయ గోడల కింది భాగంలో అందమైన శివ, విష్ణు, దశావతారాలు, షణ్ముఖ,  మాత కాళి,  వివిధ రకాల జంతువులు ఉంటాయి. ఈ దేవాలయంలో కార్తీక శుక్ల పక్షంలో జరిగే విద్యాతీర్ధ రధోత్సవం ప్రసిద్ధి గాంచిన వేడుక...🙏🙏🙏

కామెంట్‌లు లేవు: