6, జూన్ 2023, మంగళవారం

ఒడిబియ్యం

 


పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?


'పెళ్లి' అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని, కూతురును మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసు కుని, మనసారా ఆశీర్వదించి.. ఆమెకు ప్రీతి పాత్రమైన దుస్తులు, పసుపు-కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని 'ఒడిబియ్యం' పోయడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: