8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

భక్త జయదేవుడు

 ✍️... *నేటి చిట్టికథ* 


కృష్ణాష్టమి సందర్భం గా...


భక్త జయదేవుడు 


కొంత మంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 


13 వ శతాబ్దానికి  చెందిన, వ్యాసుని అవతారంగా భావించే

జయదేవుడు' ఇటువంటి వారిలో ఒకరు.


 ఈయన  జీవితం, పూర్ణ భావంతో, భక్తీ విశ్వాసాలతో, సాధన చేస్తే,

భగవంతుడే, అనేక  రూపాల్లో వచ్చి రక్షిస్తాడని, తెలియజేస్తుంది. బాల్యంలోనే ,ఆశుకవిత్వం చేప్పారు,



ఏకసంధాగ్రాహి , జగన్నాధుని భక్తుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు

కనిపించడంవల్ల, బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి.


 జగన్నాధుని భక్తుడయిన కళింగ రాజు,

తన పాటలను కాక, జయదేవుడి పాటలు ఎక్కువ ప్రాచుర్యం పొందడం సహించలేక, పండితుల సలహాతో, ఇరువురి

కీర్తనలను ఒక రాత్రి, జగన్నాధుని గుడిలో ఉంచుతాడు. 


ఉదయానికి, రాజుగారి గ్రంధం ముక్కలుముక్కలయ్యి

ఉండడం చూసి, అభిమానపడి, ప్రాణత్యాగం చెయ్యబోతాడు. 


అప్పుడు జగన్నాధుని విగ్రహం లోనుంచి,

'రాజా! మీ ఇద్దరి కవితలూ గొప్పవే, ఈర్ష తో, అధికార బలంతో, నువ్వు ప్రవర్తించడం వల్ల, నీ కీర్తనలు నేను

స్వీకరించలేదు, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కనుక, నీ పాటలను కూడా కొన్నిటిని స్వీకరిస్తున్నాను,' అన్న

మాటలు వినిపించాయి.


ఒక సారి, జయదేవుడు

ప్రక్క ఊరిలో,భాగవత సప్తాహం చేసాడు. ప్రతిఫలం ఆశించడని తెలిసిన షావుకారు, నలుగురు సేవకులతో,

మణిమాణిక్యాలు, బంగారం, రహస్యంగా, ఆయన వెంట వెళ్లి, పద్మావతికి ఇచ్చిరమ్మని పంపాడు.


 ఆ నలుగురు

సేవకులూ, స్వార్ధంతో కుమ్మక్కయ్యి, జయదేవుడి, కాళ్ళు-చేతులు నరికేసి, ఒక పాడుబడిన బావిలో పడేసారు. 


దారిలో వెళుతున్న వింధ్య రాజు, బావిలోంచి, 'కృష్ణా! కృష్ణా!' అన్న మాటలు విని, ఆయనను బయటకు

తీయిన్చేసరికి, లీలగా, ఆయన కాళ్ళు- చేతులు తిరిగి వచ్చేసాయి


. ఆ రాజు జరిగింది తెలుసుకుని, సంతోషించి, తన

రాజ్యంలో కూడా భాగవత సప్తాహం జరపాలని, ఆయనను భార్యా సమేతంగా తీసుకువెళ్ళాడు. 


ఆ సప్తాహానికి,

లోగడ ఆయనను బావిలో పడేసిన నలుగురు దొంగలూ వచ్చారు. భక్తి పారవశ్యంలో ఉన్న జయదేవుడు, వాళ్ళను

చూడగానే, హటాత్తుగా వెళ్లి, కౌగిలించుకున్నాడు. వాళ్ళను సత్కరించి పంపాల్సిందిగా, రాజుకు చెప్పాడు.


 అయితే,వెళ్ళే దారిలో, వాళ్ళు మట్టిలో సగానికి కూరుకుపోయారు. జయదేవుడికి, వారి దీనావస్తకు, దయ కలిగి, 'హే కృష్ణా!

వీళ్ళను రక్షించు తండ్రి!' అని ప్రార్ధించాడు. భక్తుని మాట మన్నించి, వారిని రక్షించాడు దేవుడు.


పద్మావతికి, వింధ్య రాణికి మంచి స్నేహం కుదిరింది. ఒక రొజు, రాణి గారు పంతం కొద్దీ, పద్మావతిని పరీక్షించాలని,

భటుడితో, 'జయదేవుడు, వేటలో పులి బారిన పడి చనిపోయాడని', అబద్ధం చెప్పిస్తుంది. ఆ వార్త వినగానే, ప్రాణాలు

విడుస్తుంది పద్మావతి. సిగ్గుతో ప్రాయశ్చితం చేసుకోబోయిన రాజ దంపతులను, జయదేవుడు వారించి,ఒక

అష్టపదిని గానం చేస్తాడు. శ్రీ కృష్ణ పరమాత్మ కరిగిపోయి, పద్మావతిని తిరిగి బ్రతికించాడు. 


ఈ ఉదంతం,

అష్టపదులకు ఉన్న మహత్తును, సంజీవిని శక్తిని తెలియజేస్తుంది.



జయదేవుడు అనగానే, అష్టపదులు గుర్తుకు వస్తాయి. ఈ అష్టపదులు 'గీతగోవింద మహాకావ్యం ' లోనివి. 'జయదేవ

అష్టపదులలో', 24 అష్టపదులు , ప్రతి ఒక్కటి, ప్రత్యేకమయిన రాగంతో, తాళంతో రచింపబడ్డాయి.


 .జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, 'దశకృతికృతే''. కృష్ణుడు మూడుముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, ''త్రిభంగి'' అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. 


ఫ్రజల గుండెల్లోఅజరామరంగా నిలిచిపోయిన ఆయన యొక్క గీతగోవింద మహాకావ్యం భావికాలంలో నారాయణతీర్ధ

వంటి మహా వాగ్గేయకారులకు స్పూర్తిదాయకమయ్యింది.


🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: