🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*ఈరోజు (08-09-2023) "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అనవచ్చు.*
*అయితే.......*
*రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత కాదనీ.. గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు.*
*ప్రపంచం అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ఉన్నతమైన జీవనానికి ఇవి ఎంతో ముఖ్యం. నేడు మనం "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం" జరుపుకుంటున్న సందర్భంగా........*
*ప్రతి యేడాది సెప్టెంబర్ 8వ తేదీని "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"గా జరుపుకోవడం ఆనవాయితీ.*
*1965వ సంవత్సరం, నవంబర్ 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. "అంతర్జాతీయ అక్షరాస్యతా" దినోత్సవం ప్రకటించబడింది.*
*ఆ తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం.*
*ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్య కారణంగా చెప్పవచ్చు.*
*అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే...*
*అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించటం. ఇది పిల్లల్లో విద్యపైనేగాకుండా, వయోజన విద్యమీద కేంద్రీకరించ బడుతుంది.*
*అదలా ఉంటే........*
*ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో), ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఓ ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945లో స్థాపించారు. ఈ సంస్థ తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణలకు తోడ్పాటునందించటమేగాక... అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం పాటుపడుతుంది.*
*193 మంది సభ్యులు, ఆరుగురు అసోసియేట్ సభ్యులు కలిగిన యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది. దీని ప్రధాన అంగాలు మూడు.*
*వాటిలో........*
*మొదటిది తన పాలసీ తయారీ కోసం,*
*రెండవది అధికార చెలామణి కోసం*
*మూడవది దైనందిన కార్యక్రమాల కోసం పాటుపడుతాయి.*
*యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం.*
*యునెస్కో ప్రజా ప్రకటనలిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశ్యాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. "భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్‌లను ప్రోత్సహించడం.. లాంటివి చేస్తుంది.*
*కాగా.........*
*యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఇక ఐక్యరాజ్య సమితి అయితే 2003-2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది.*
*"లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.*
*ఆ సంగతలా పక్కనబెడితే...*
*ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాథంలో వున్నట్లే చెప్పవచ్చు.*
*ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.*
*మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.*
*నారాయణ రావు పీవీయస్*
*విశ్రాంత ఉపాధ్యాయులు*
*కొత్తపాళెం*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి