సనాతన ధర్మం అంటే ఏంటి?
అస్సలు సనాతన ధర్మం లో ఏముంది? అస్సలు నిజం గా భారతీయులు అందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా?
కనీసం సనాతన ధర్మం అంటే నిజమైన అర్ధం కచ్చితంగా ఎంత మంది కి తెలుసు?
అస్సలు ధర్మం అంటే తెలుసా?
సనాతన ధర్మం అంటే హిందువుల ఆచార వ్యవహారాలు, నడవడిక, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మాత్రమే నా?
సనాతన ధర్మం అంటే సృష్టిలో ప్రతి వస్తువు లో భగవంతుని చూడటం.
సనాతన ధర్మం అంటే మనిషి మనీషిగా, మహర్షి గా మారటానికి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహా భారత గ్రంధాల లో మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చూపించిన మార్గం.
"భగవద్గీత" సృష్టి లో మనిషి ఎలా నడుచుకోవాలి, అలాగే కర్మ సిద్ధాంతం , ధర్మాన్ని ఆచరించడం చూపించిన మహా గ్రంధం కూడా సనాతన ధర్మాన్నే భోదిస్తూ ఉంది.
అయితే హిందూ ధర్మం లో కూడా కాలాన్ని బట్టి కొందరి స్వార్ధ పరుల కుటిల స్వభావాలు వల్ల " సతీ సహగమనం, అంటరాని తనం, బాల్య వివాహాలు మొదలగు అనేక సాంఘీక దూరాచారాలు మొదలు అయ్యాయి, అయితే మరీ వాటిని నిర్మూలన కోసం కృషి చేసిన వారు ఎక్కువ శాతం కూడా అగ్ర వర్ణాలు లో జన్మించిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
కానీ కొంతమంది ఆయా సాంఘీక దూరాచారాలు మాత్రమే సనాతన ధర్మం అని నమ్మించే ప్రయత్నాలు చేస్తూ అమాయకులను మభ్య పెడుతున్నారు. అది కేవలం వారు పాపులర్ అవ్వాలని , అంతే తప్ప జనాల మీద నిజమైన అభిమానం తో కాదు.
ప్రతి మతం లో కొన్ని సాంఘీక దూరాచారాలు ఉంటాయి, అయితే అవి ఆ మతం వారు పూజించే దేవుడు ఆ దూరాచారాలు ను పాటించమని చెప్పినట్టు అర్ధమా?
ఏ మతం యొక్క ముక్య తత్వం అయిన మనిషి మనిషి గా బ్రతకమని, భగవంతుడు ని ధ్యానించమనే చెప్తుంది. మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు , సాంఘీక దూరాచారాలు పాటించమని చెప్పదు.
ఏ గ్రంధం లో అయిన, మతం లో అయిన, ఆచార వ్యవహారాలు లో అయిన, కట్టుబాట్లు, సాంప్రదాయాలలో అయిన ఉన్న మంచిని గ్రహించాలి,
కానీ మనిషి బుద్ధి సామాన్యంగా చెడు నే ఎక్కువ గ్రహిస్తుంది, ఆ చెడు నే ఎక్కువ వ్యాప్తి చేస్తోంది.
సనాతన ధర్మం హిందువులు నడిచే విధానం,
అందుకే హిందూత్వం అంటే ఒక మతం కాదు, ఒక నడవడిక, ధర్మాన్ని పాటిస్తూ , స్వధర్మ ఆచరణ చేస్తూ, "పరోపకారర్థయా ఇదం శరీరం" అని చూపించేది నిజమైన , మనలో చాలామంది పాటించని సనాతన ధర్మం,
అలాగే సనాతన ధర్మం లోని ప్రతి ఆచారం లో పూర్తిగా పరిశీలించి చూస్తే ఒక సైన్స్ ఫాక్టర్ కచ్చితంగా ఉంటుంది.
బయటకు వెళ్లి వచ్చి కాళ్ళు కడగడం లో, ఇంట్లో పసుపు నీరు జల్లటం లో, మడి ఆచరించటం లో, దీపారాధన లో, హారతి వెలిగించడం లో, నిల్చునే, కూర్చునే, తినే, పడుకునే విధానం, కట్టు, బొట్టు, వృక్షాలు ను పూజించడం లో, లో ప్రతి దాంట్లో సైన్స్ ఫాక్టర్ తో కూడిన నియమాలు ఉన్నాయి. అవన్నీ సనాతన ధర్మం మనిషికి చూపిస్తుంది.
ప్రస్తుతం సంఘాన్ని ఉద్ధరించాలి అని సనాతన ధర్మాన్ని తప్పు పట్టె మహానుభావులందరూ ముందు సనాతన ధర్మం లో ఏముందో, దాని సారాంశం ఏంటో పూర్తిగా తెలుసుకుని తరువాత సనాతన ధర్మాన్ని నిర్మూలించండి , అంతే గాని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మధ్యలో తీసుకుని వచ్చిన సాంఘీక దూరాచారాలు చూపించి అదే సనాతన ధర్మం అని తెలిసి తెలియక మాట్లాడే అజ్ఞాన మహానుభావుల మాటలు నమ్మి బొక్క బోర్లా పడితే అది మీ ఇష్టం.
ప్రపంచ దేశాలు గుడ్డలు కట్టుకోవడం కూడా తెలియని , కొండ గుహలు లో ఆదిమానవులు గా నివసించినప్పుడే నా భారత దేశంలో అంతులేని టెక్నాలజీ , వజ్రాలు, స్వర్ణాభరణాలు, చెక్కు చెదరని కట్టడాలు, ఆలయాలు, అలాగే ఎన్నో కాస్మో పోలిటీన్ నగరాలు భారత దేశంలో ఉన్నాయి, ఇది చరిత్ర సరిగ్గా చెప్పకపోయినా, ఎన్నో చారిత్రక ఆధారాలను corbondating టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి నిరూపితం అయిన నిజాలు.
సనాతన ధర్మం ఎప్పుడూ గొప్పదే.
అది నిర్మూలిస్తే మనం నమ్ముతున్న నేటి సైన్స్ కూడా చాలా వరకు దానితో పాటే అంతరించిపోయి మానవాళి వినాసనానికి దారి తీస్తుంది అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.
మేర భారత్ మహాన్.
జైహింద్ముందు ధర్మమంటే ఏమిటి ?
ధర్మం అంటే సత్యం, శౌచం, దయ (సర్వభూతములు యడ దయ) అహింస, అనే నాలుగు పాదాలుగా పిలువబడే మానవ నడవడిక.
ఆధ్యాత్మికంగా చూస్తే బ్రహ్మం సత్యము, శరీరము అసత్యం. వ్యవహారికంగా చూస్తే హరిచంద్రుని కథ సత్యానికి ప్రతిరూపం.
ఈ నాలుగు నడవడికలు
ధర్మానికి నాలుగు పాదాలు అనే నానుడి.
ఇది సృష్టి ఆరంభం నుంచి ఉంది కాబట్టి ఇటువంటి ధర్మాన్ని సనాతన ధర్మము అంటారు.
ఇక విషయాన్నికొస్తే ఈ సనాతన ధర్మం ఆచరణకు సమాజానికి ఇది ఏ విధంగానూ అపకారం కాదు.
మనదేశంలో జ్యోతిష్యం చదవని వాడిని కూర్చోబెట్టి టీవీలు జ్యోతిష్య శాస్త్రం ఊహ అంటారు. అదేవిధంగా సనాతన ధర్మం తెలియనివాడు అదేదో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయంగా పరిగణించి వారేదో సమాజానికి హితం చేస్తున్నట్లు ఫోజుపెట్టి బ్రాహ్మణ ద్వేషాన్ని ఈ విధంగా తెలియపరచుకుంటారు.
అసలు ముందు తమిళనాడులో ద్రవిడ కసిగా ఉండేది. దానికి పెరియార్కర్ ఫౌండర్.
ఆయన బ్రాహ్మణులను చంపండి అనేవాడు.
తర్వాత ఆ పార్టీ డీఎంకేగా చీలిపోయింది.
ఆ తరువాత ఆ పార్టీ ఏడీఎంకె గా చీలిపోయింది. డీఎంకే వరకు బ్రాహ్మణ ద్వేషం ఉంది. ఎడియంకే లో బ్రాహ్మణ ద్వేషం లేదు.
ఇప్పుడు డీఎంకే పరిపాలనలో ఉంది కాబట్టి సహజంగా బ్రాహ్మణ ద్వేషం ఉంటుంది.
దాని ఫలితమే ఈ సనాతన ధర్మ విలువల విమర్శ.
చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టాలి. లేకపోతే విషం
చిన్ని పాములు పుట్టుకొస్తాయి. సనాతన ధర్మేయులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలి. లేకపోతే భావితరాలు భారతీయ ఉనికిని కోల్పోవచ్చు. శ్రద్ధకి వివేకానందుడు స్ఫూర్తి.
భారత్ మాతాకీ జై.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి