8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 16*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 16*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷



       *కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం*

        *భజంతే యే సన్తః కతిచి దరుణామేవ భవతీమ్ |*

       *విరించి ప్రేయస్యా స్తరుణ తరశృంగారలహరీ*

        *గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ ||*



ఎర్రని లలితాదేవి, తెల్లని సరస్వతీదేవిల సంయుక్త రూపమైన అరుణ సరస్వతిని ఆవిష్కరిస్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో.


ఈ అరుణ సరస్వతి, తనను ఉపాసించేవారికి, 


సతాం రంజనమమీ = సత్పురుషులను రంజింపజేసేటట్లు వారు మెచ్చేటట్లు


గభీరాభిర్వాగ్భిః = గంభీరమైన, లోతైన వాక్కును ప్రసాదిస్తుందట.


విరించి ప్రేయస్యా స్తరుణతర శృంగార లహరీ = బ్రహ్మకు ప్రేయసి అయిన సరస్వతీదేవి (వాక్కు వేదమాత బ్రహ్మ ద్వారా వ్యక్తమైంది కనుక) నిత్య యవ్వన. ఆమె యవ్వనము, సౌందర్యము, శృంగారము, ఆ ఉపాసకుని వాక్కులో కనబడుతుంది. ఇవన్నీ ఆ వేదమునకే అన్వయము.


ఇక అరుణ సరస్వతి కాంతులు ఎలా ఉంటాయి?


 ప్రాతఃకాలంలో అరుణ కాంతులు, సాయంకాలంలో వరుణ కాంతులు (నీరెండ) ఉంటాయి కదా అలాగ


కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం = ప్రాతః సమయంలో కవీంద్రుల మనస్సనే కోనేరులో భావనలనే కమలాలు విచ్చుకున్నట్లు ఆమె అనుగ్రహం కలుగుతుందట.


అరుణ సరస్వతి అమృత సముద్ర మధ్యంలో అరుణ కాంతులతో ప్రకాశిస్తూ శిరముపై చంద్రలేఖ, త్రినేత్రములు, పైన నాలుగు హస్తములలో పాశాంకుశాలు, ధనుర్బాణాలు (చెరకు విల్లు, పూలబాణాలు); క్రింది నాలుగు హస్తములలో వరద అభయ ముద్రలు, పుస్తకము, అక్షమాల కలిగియుంటుందట. ఈ అరుణ సరస్వతి ఒక మంత్ర విశేషము అని పెద్దలు చెప్తారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: