: *కం*
జగతికి జీవన సుగతుల
భగవద్గీత ను నొసగిన భగవంతుండా
నిగమాగమ మూర్తునిగా
జగమంతయు నీకు మ్రొక్కు జయ శ్రీ కృష్ణా.
*అందరికీ శ్రీ శోభకృన్నామ సంవత్సర శ్రీ కృష్ణ జన్మాష్టమీ,గోకులాష్టమీ శుభాకాంక్షలు.*
*కం*
ఇతరుల పై ద్వేషముతో
సతతము రగిలెడి జనులకు సౌఖ్యం బెపుడున్
మితమై జీవితమంతయు
హుతమగు చుండును నిరతము హోరుగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఇతరుల పై ద్వేషం తో ఎల్లప్పుడూ రగిలిపోతున్న వారి సౌఖ్యం తరిగి పోయి జీవితమంతా వేగంగా నాశనమగును.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి