మోహముద్గరము
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్ కరణే
తనిసి గోవింద ! గోవింద ! యనుచు భక్తి
భజన మొగిసల్పు మో మూఢ ! ప్రాప్తమయ్యె
మరణకాలమ్ము నీకు , వ్యాకరణ మేల ?
అద్ది రక్షింపజాల దా యముని నుండి. 1*
మూఢ ! జహీహి ధనాగమ తృష్ణా
కురు సద్బుద్ధి మనసి వితృష్ణా
ఎల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం
విత్త సముపార్జనా కాంక్ష విడువు మూఢ !
మనసు సద్భుద్ధియందున మగ్న పరచు
మరయ నిజకర్మవలన నీ కందినట్టి
విత్తమున తృప్తిపరచుమీ చిత్తమెపుడు 2*
నారీ స్తనభర నాభీదేశం
దృష్ట్వాత్ మాగా మోహావేశం
ఏత న్మాంస వసాది వికారం
మనసయే చింతని వారం వారం
నారి స్తనములపొందిక నాభి జూచి
మోహభూమాబ్ధి మొఱకువై మునుగ వద్దు
సర్వమదియెల్ల మాంసాస్రు సంగతమ్ము
మాటిమాటికి తలపగా మాను మింక 3*
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి