*కం*
లెక్కకు మించిన సిరులను
లెక్కెరుగక నొందుకన్న లెక్కించుగతిన్
చక్కగ నక్కర తీర్చుకు
తక్కిన సిరి సంస్కరించ తలచుము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! లెక్కపెట్టలేనన్ని సిరులను సంపాదించడం కన్నా గణనీయంగా నీ అవసరాలకు సరిపోయే సిరులను వాడుకొని తక్కిన సిరులను సంస్కరించ డానికి ( మంచిపనులకు ఉపయోగించే) యోచన చేయుము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
ఉపయోగించెడి మనసుకు
నుపయుక్తంబగు సకలము నుర్విన నెపుడున్.
ఉపయోగము లేదనుచును
నెపమెంచక విలువలెరుగ నెగడుదు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఉపయోగించుకునే మనసు ఉన్న వారి కి ఈ భూలోకంలో అన్నీ ఉపయోగకరమైనవే అవుతాయి. ఉపయోగం లేదు అని చెప్పుటకన్నా దాని విలువ ను తెలుసుకుంటే వర్ధిల్లెదవు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి