ॐ శ్రీకృష్ణావతారం - కొన్ని ముఖ్య అన్వయాలు
దేవకీదేవి అష్టమ గర్భంలో అవతరించాడు.
నందగోపునివద్ద పెరిగాడు.
* వెన్నముద్దలు కాజేశాడు
నవనీతమ్ - "నవ" అంటే "కొత్తగా",
"నీతమ్" అంటే -పొందబడింది"
అంటే, ఈ జన్మలో మనం ప్రోగు చేసుకొనే కర్మ.
జన్మాంతర సంబంధమైన వాసన పాతది.
నవనీతచోరుడు - ఈ జన్మలో మనకి కోరికలు కలగజేసే కర్మల దోషాలు (ప్రార్థనతో) హరిస్తాడని అంతరార్థం.
* కాళీయమర్దనం
కాళీయుడు - తమో గుణం
వ్యాపించేది మాయ.
మాయకు మూలస్థానమైన వాసనా బీజం అయిన "కదంబ వృక్షం" నుండి దూకి తమోగుణంమీద నృత్యం చేశాడు.
పాదాలు శిరస్సుపై పెట్టుకుంటే, ఆ పాద ముద్రలు చూస్తే, "గరుడుడు"(వేదం) ఏమీ చేయలేడు - అంటాడు.
అంటే వేదం కర్మలు చెబుతుంది కదా!
స్వామి పాదముద్రలు శిరసున ఉంచుకొని, ఆయనని ఆశ్రయిస్తే,
కర్మ ఫలాలతో సంబంధంలేకుండా, అనుగ్రహిస్తాడనేది సందేశం.
* గోపికా వస్త్రాపహరణం
గోపికలు - ఇంద్రియాలు
- వాసనా తత్త్వం కలిగిన ఇంద్రియాలు నీటిలో మునిగియున్నాయి.
- గుడ్డలు విడిచినా(మాయ తొలగినా) మళ్ళీ ప్రాపంచిక మాయలో పడతాయి.
- మాయను కృష్ణుడు స్వాధీనపరచుకుంటే,
"నీరు" - అంటే "అజ్ఞానం".
దాని నుండీ బయటకు వస్తే తప్ప వస్త్రాలు ఇవ్వను అన్నాడు.
ఆయన చేతినుంచీ వచ్చేది "జ్ఞానం".
లోకంలో వచ్చేది మాయ.
కృష్ణః
కర్షతీతి కృష్ణః
- ఆకర్షించే స్వభావం ఉన్నవాడు.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి