11, జూన్ 2023, ఆదివారం

 🕉 మన గుడి :



⚜ కడప జిల్లా : సంబటూరు గ్రామం


⚜ శ్రీ  లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం



💠 ఒకనాడు కడప సీమలో సంగమేశ్వరం (అనిమెల), 

మోపూరు భైరవేశ్వరాలయం(నల్లచెరువు) హత్యరాల(అత్తిరాల) మరియు పుష్పగిరి వంటివి క్షేత్రాలు శైవ మతానికి ప్రసిద్ద క్షేత్రాలుగా ఉండగా ...


గండికోట, 

సంబటూరు, 

వెయ్యినూతుల కోన, 

రంగనాథాలయం (పులివెందుల), 

తాళ్ళపాక మరియు ఒంటిమిట్ట క్షేత్రాలు శ్రీవైష్ణవ మతానికి అత్యంత ముఖ్యమైన క్షేత్రాలుగా ఉండేవి.


💠 కడప జిల్లా కమలాపురం నుండి కోకటం వెళ్లే దారిలో వస్తుంది సంబటూరు గ్రామం. 

ఇక్కడి లక్ష్మీ చెన్నకేశవాలయం అత్యంత ప్రాచీనమైనది , మరియు ప్రాశస్త్యం కలది. సంబటూరుకే శ్రీభాష్యపురం అని మరో పేరు ఉన్నది. 


💠 పూర్వము ముగ్గురు ఆళ్వార్లు పొయ్‌గయాళ్వార్, పూదత్తాళ్వార్ , పెయ్ అళ్వారులు బదరికాశ్రమానికి వెళ్తూ, చ్యవనాశ్రమములో కొన్నాళ్ళు ఉన్నపుడు, భాగవత పురాణంలో చెప్పబడినట్లుగా, చ్యవనాశ్రమము శ్రీభాష్యపురం అవుతుందని చెప్పారు. 

ఈ శ్రీభాష్యపురం, సంబటూరుకి ఇంకో పేరు.


💠 ఒకనాడు ఈ గ్రామము శ్రీవైష్ణవులకు అత్యంత విశిష్టమైనది. ఆలయ ప్రాంగణంలో ఒక్క లక్ష్మీ చెన్నకేశవ ఆలయం తప్ప మిగతా ఆలయాలు ఇప్పుడు శిథిలమై ఉన్నాయి.  విజయనగర రాజుల, మట్లి రాజుల ఏలుబడిలో ఈ ఊరు శ్రీవైష్ణవ క్షేత్రంగా వెలిసిల్లిందని, తెలుగునాటే కాక తమిళులకు కూడా ఈ క్షేత్రము ముఖ్యమైనదని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది.


⚜ స్థల పురాణం ⚜


💠 పూర్వం ఇక్కడ చ్యవనముని ఆశ్రమం ఉండేది , ఆ చ్యవనాశ్రమం కాలక్రమేణా చమటూరు అయినదని అదే తరువాత కాలంలో సంబటూరు అయినదని స్థానిక చరిత్ర. 


💠 విజయనగర రాజుల, మట్లి రాజుల ఏలుబడిలో ఈ ఊరు శ్రీవైష్ణవ క్షేత్రంగా వెలిసిల్లిందని, తెలుగునాటే కాక తమిళులకు కూడా ఈ క్షేత్రము ముఖ్యమైనదని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. 

ఈ ఊరు ఒకప్పుడు సీమలోని అన్ని గ్రామాలలాగే ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్నప్పటికీ ఇప్పుడా గొడవలేవీ లేకుండా ప్రశాంతంగా ఉంటున్నది.


💠 మహాభారత కాలం నాటి అభిమాన్యుని మనవడైన జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు స్థల పురాణం  చెబుతుంది. కాలగమనంలో ఈ దేవాలయం వివిధ రకాలుగా తన రూపు రేఖలను మార్చుకుంటూ పునరుద్ధరణ జరుగుతూ వచ్చినది.


పినాకిని నదీతేరే  చోళరాజాజ్ఞ ప్రతిష్టితం

చ్యవన స్యాశ్రమే రమ్యే  కేశవాఖ్య ఇతి స్మృతం। ।


💠 చోళ రాజు కాలంలో కూడా ఈ దేవాలయం పునరుద్దరణ మరియు విగ్రహ పునఃప్రతిష్టించినట్లు తెలుస్తోంది. 


💠 దాదాపు 550 సంవత్సరాల క్రితం ఈ ఆలయ వైభవం గురించి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించి 7 కీర్తనలు రాసారు

ఉదాహరణకు:  

“చక్కటి ఈ వెన్నుడు సంబాటూరు చెన్నుడు “


💠 అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు కూడ ఇక్కడ స్వామిపై ఒక కీర్తన రాసారు.


💠 అప్పటి విజయనగర ప్రభువైన శ్రీ సదాశివ దేవరాయలకు సంతానం లేక బాధ పడుతున్నప్పుడు ఒకరోజు చెన్నకేశవస్వామి రాజుకు కలలో కనిపించి సంబటూరు గ్రామంలో వెలసిన నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే మీకు సంతానం కలుగుతుంది అని స్వామి చెప్పగా 1473 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.  

ఆనాటి నుండి దాదాపు 100  సంవత్సరాల క్రితం వరకు ఏడాదికి రెండు మార్లు మహా వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి తర్వాత పూర్వపు వైభవాన్ని సంతరించుకుటకై  03-05-1992 నాడు తిరిగి ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ జరిగింది.


💠 1992 నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మహోత్సవాలు ఈనాటికీ ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు (పుష్పగిరి తిరుణాల రోజు)  జరుగుతున్నవి


💠 శ్రీశైల దక్షిణ క్షేత్రం అయిన పుష్పగిరికి పడమర దిశలో, కమలాపురానికి 5 కిమీ ల దూరంలో ఈ ఊరు ఉంది.

కామెంట్‌లు లేవు: