*ఇది కూడా పూజయే*
➖➖➖✍️
```పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూరు జిల్లా కొడవసల్ - కొరడచెర్రి మార్గంలో సంచరిస్తున్నారు. తిరుక్కలంబూర్ కి వెళ్తూ, కొంతమంది మురికివాడల ప్రజలు మహాస్వామి వారిని కలిసి ప్రణామాలు సమర్పించారు.
మహాస్వామివారు ప్రతి ఒక్కరిని పలకరించి వారి బోగోగులని విచారించి, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏమాత్రం త్వరపడకుండా మేనేజరుతో వారి బాధలను తీర్చడానికి శ్రీమఠం తరపున ఏమి చెయ్యవచ్చో, మఠం తరపున చెయ్యగలమా లేదా మఠం దాతల సహాయం తీసుకోవలసి వస్తుందా అని దీర్ఘంగా చర్చిస్తున్నారు.
మేనేజరు మరి కొంత మంది ఉద్యోగులు తరువాతి మకాం చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని, తదనంతరం జరగవలసిన పూజకూడా ఆలస్యం అవుతుందని కంగారు పడుతున్నారు.
కాని పేదల దైవం, దీన రక్షకుడు అయిన పరమాచార్య స్వామివారు వారితో కూర్చుని అక్కడున్నవారందరికి స్థానిక దుకాణాల నుండి పంచలు, చీరలు తెప్పించడని ఆజ్ఞాపించారు. కావాల్సినన్ని ఆ దుకాణంలో దొరకకపోతే కొడవసల్ నుండి తెప్పించి ఇమ్మని చెప్పారు. చిక్కటి సాంబారు అన్నం చేయించి వాళ్ళందరికి చెట్ల నీడన వడ్డించమని ఆదేశించారు.
దాదాపు రెండు మూడు గంటలు వీటన్నిటి కోసం గడపడం వల్ల మరుసటి మకాం చేరుకోవడం ఆలస్యమవుతుందని, తరువాత జరగవలసిన దీర్ఘమైన పూజక్రతువు చెయ్యడానికి స్వామివారికి కష్టం అవుతుందని తలచాడు.
ఈ విషయాన్ని మహాస్వామివారికి తెలపాలని మొదలుపెట్టగా స్వామివారు వెంటనే, “ఇది కూడా పూజయే” అని చెప్పి ఆ దీనులతో మాట్లాడడం కొనసాగించారు.
పేదలకు సహాయం చెయ్యడం, వారి ఉన్నతికి పాటు పడడం కూడా ఈశ్వర సేవయే అనే సందేశాన్ని స్వామివారు మనందరికి అందించారు.
మానవ సేవయే మాధవ సేవ!
[అలా అని ధర్మాన్ని, ఆచారాన్ని, అనుష్టానాన్ని పక్కనపెట్టి మానవసేవ చేస్తే అది వ్యర్థం. ధర్మము కానిది ఎల్లప్పుడూ వర్జనీయమే. ఏమి చేసినా ధర్మబద్ధంగానే చెయ్యాలి. ధర్మాన్ని వదిలి మానవసేవ చెయ్యడం గజదొంగకి ఉచిత కంటి ఆపరేషన్ చెయ్యించడం వంటిది. కన్న తల్లి తండ్రులని వదిలి వేరేవాళ్ళను ఆదరించడం వంటిది. అది మహానుభావులకే చెల్లింది. సామాన్య మానవులకు స్వధర్మాన్ని మించినది లేదు.]✍️```
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం ।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ॥
--- రా. గణపతి, ‘మహాపెరియవళ్ విరుంధు’ నుండి.
https://t.me/paramacharyaVaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
*ఆధ్యాత్మిక సాధన అంటే వైరాగ్యం తప్పనిసరా?*
*అన్నిటినీ త్యాగం చేయవలసిందేనా?*
*విరాగిగా మారవలసిందేనా?*
*అసలు వైరాగ్యం అంటే?*
*వైరాగ్యం అంటే అన్నింటినీ వదులుకోవడం కాదు...*
*వైరాగ్యం అంటే త్యాగం కాదు... విరాగిగా మారడం అంతకంటే కాదు..*
*మరి వైరాగ్యం అంటే?*
*అన్నింటిలో (ప్రపంచంలో) ఉంటూనే, మనసుకు ఏదీ అంటకుండా, విచక్షణను వదిలేస్తే చాలు.. అదే వైరాగ్యం...*
*తామరాకు మీద నీటిబొట్టు లాగా అన్నమాట.....*
*అంటే?*
*రుచి - అరుచి, బాగుంది - బాగాలేదు, నచ్చింది - నచ్చలేదు, ఆసక్తి - అనాసక్తి, అనే విచక్షణ (మనసు యొక్క ఒకానొక భావన) వదలి వేయడమే వైరాగ్యం.......*
*ఎలా ఉన్నా ఆహారం ప్రాప్తంగా స్వీకరించాలి..*
*ఎలా ఉన్నా వర్తమానంలో వచ్చే ప్రతి అనుభవాన్ని భగవత్ ప్రసాదంగా ఆహ్వానించాలి*
*ఒక్కసారి ట్రై చేస్తే... వైరాగ్యం అంటే ఏంటో మీకే అర్థమవుతుంది...*
🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ అరుణాచల శివ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి