11, జూన్ 2023, ఆదివారం

జన్మ లక్ష్యం…*

 100623j1913.      120623-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *మానవ జన్మ లక్ష్యం…*

              *బ్రహ్మ జ్ఞానం!*

                ➖➖➖✍️


*మన జన్మ లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం, జన్మను సార్ధకత చేసుకోవడం..!*


*విశ్వమంతా బ్రహ్మం ఉంది, బ్రహ్మం తప్ప మరేమీ లేదు.*

*అయినా, అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు.*


*బ్రహ్మం - సత్యం - జ్ఞానం - అనంతం..!*

*ఇదీ ఉపనిషత్తులు ఇచ్చిన అర్థం. బ్రహ్మం అంటే సత్యం,*

*సత్యం అంటే జ్ఞానం,*

*జ్ఞానం అంటే అనంతం...*

*అంటే.. ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ఒకటే.*


*స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్ అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః*


*ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతారు.        బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన 'చ్ఛుక్రమ్' పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు.*

*జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు.*

*పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు.*


*'అకాయమ్' ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం.*

*'అవ్రణమ్' రోగాలు, వ్యాధులు అంటని శరీరం.*


*'అస్నావీరమ్'.. ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక 'శుద్ధమపాపవిద్ధమ్' ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది.*


*పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు.*

*కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో.   మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది.*


*ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ మాదిరిగా జ్ఞానం అంతటా విస్తరించి వుంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు.*

*వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.*

*వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు.* 

*అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.*


*గురువు మనకు ఇది చెప్పాలంటే.. మనకు నాలుగు అర్హతలు కావాలి. 1. వైరాగ్యము. 2. వివేకము. 3. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం  అనే ఆరు సంపదలు 4. ముముక్షత్వం.. ఈ 4 మీలో ఉంటే.. గురువు మిమ్మల్ని పరీక్ష చేసి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు.* 


*వరుణుడు తన కొడుకైన భ్రృగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.*


*నిజానికి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయం చెప్పలేం. ఒక్క ఘడియలో రావచ్చు. ఒక్క రోజులో రావొచ్చు. ఒక్క సంవత్సరంలో రావొచ్చు. ఒక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. మారడమేకాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మ గానే ఉన్నారు - అని తెలుసుకొంటారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

కామెంట్‌లు లేవు: