11, జూన్ 2023, ఆదివారం

ఈ రోజు పద్యము:

 187వ రోజు: (భాను వారము) 11-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ధరణీనాయకు రాణియు

గురురాణియు నన్నరాణియు కురకాంతను గ

న్నరమణి దను గన్న దియును 

ధర నేవురు తల్లులనుచుఁ దలఁపు కుమారా!


 ఓ కుమారా! రాజు భార్యయు, గురు భార్యయు, అన్న భార్యయు, అత్త (భార్య తల్లి)యును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను. 

 

ఈ రోజు పదము. 

శరభము: అగౌకసము, ఉత్పాదకము,ఊర్థ్వలోచనము, చౌగంటి, మీగండ్లమెకము.

కామెంట్‌లు లేవు: