80 ఏళ్ల రాజపుత్ర వీరుడు బుందేల్కండ్ రాజా ఛత్రశాల్.. తనను వేలాది మొఘుల్ జీహాదీలు చుట్టుముట్టినప్పుడు ' పీష్వా బాజీరావ్ ' కు రాసిన ఉత్తరంలో చేసిన సంబోధన.. నదిలో దిగిన గజేంద్రుడ్ని మొసలి పట్టుకున్నట్టు నన్ను నాశత్రువులు పట్టుకున్నారు.. ఈ సమయంలో నన్ను ఆదుకొని నాకు తోడుగా వచ్చి పొరాడి తమ శౌర్యాన్ని చూపి నన్నూ నా ప్రజలను నారాజ్య మహిళల మానాలనూ కాపాడాల్సిన నా తోటి రాజపుత్రులు షండులై పారిపోతున్నారు.. ఒక నిస్సహాయ రాజపుత్రుడు ఒక మహావీరుడైన బ్రాహ్మణుడ్ని తనరాజ్యం తన మహిళల మానప్రాణ రక్షణకోసం చేయిచాచి ఆర్ధిస్తున్నాడు.. ' పీష్వా బళ్లాడ్ '.. నన్నూ నా రాజ్యలక్ష్మిని అవమానాల నుంచీ కాపాడు.. హిందూ ధర్మపరిరక్షకుడైన శివాజీ రాజే ఖడ్గానివి నీవు.. ఒక సుక్షత్రియుడి విన్నపాన్ని మన్నిస్తావని ఆశిస్తూ - రాజా ఛత్రశాల్.. ఈ లేఖ చూసిన మరుక్షణమే రక్తం ఉడికిపోయిన ' పీష్వా బళ్లాడ్ ' తన దగ్గర ఉన్న కేవలం 500 ఆశ్విక దళంతో బుందేల్ ఖండ్ వైపు పరుగుతీశాడు.. 10 రోజుల ప్రయాణం కేవలం 48 గంటల్లో ముగించి అలసటన్నదే లేకుండా గెరిల్లా యుద్ధ తంత్రంతో మొఘల్ సేనలను ఊచకోత కోసి సేనాధిపతి ఫంగస్ ఖాన్ తల నరికి రాజా ఛత్రశాల్ కు కానుకగా అందిస్తూ చెప్పాడు.. ఒక సుక్షత్రియుడి రాజ్యాన్ని రాజ్యలక్ష్మిని మహిళల మానప్రాణాలను చెరచబోయిన ఒక దుర్మార్గుడి తలను ఒక బ్రాహ్మణ్ వీరుడు మీకు బహుమతిగా ఇస్తున్నాడు స్వీకరించండి.. ఆ విజయానికి ఉప్పొంగిపోయిన రాజా ఛత్రశాల్ పీష్వా బాజీ ని ఆలింగనం చేసుకొని అంటాడు ' ఇదం క్షాత్రమ్ ఇదం బ్రాహ్మ్యమ్ '.. జైభవానీ..వీర్ శివాజీ.. భారత్ మాతాకీ జై..🙏🙏🙏 శేఖర్ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి