**నిర్వాణ షట్కము**
01
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
ఘనత గల్గిన చిత్తమ్ము మనసు కాను
అరయ బుద్ధిని గాను నే నహము కాను
చెవులు కన్నులు నాసిక జిహ్వ కాను
అవని వ్యో మాగ్ని వాయువు నరయ కాను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 01
02
న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుః న వా పంచకోశః
న వాక్పాణిపాదం న చోపస్థపాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
ప్రాణ సంజ్ఞను భావింప కాను నేను
పంచ వాయువు లరయంగ యంచ కాను
రక్త రస మాంస మేదాస్థి యుక్త మైన
సప్తధాతువులను గాను సంభ్రమముగ
పంచకోశంబులను గాను నెంచ నేను
కర చరణ మాట లేమియు న్నరయ కాను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 02
03
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
ద్వేష మనురాగ లోభముల్ వెదుక లేవు
ఆరయ మనురాగ ద్వేషమ్ము లసలు లేవు
మోహలోభంబులును కూడ మొదలు లేవు
మరియు ధర్మార్థ కామముల్ మహిత ముక్తి
యేవియును లేవు నాకు నే నేమి కాను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 03
04
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
ఎన్నగా పుణ్య పాపంబు లేవి లేవు
సుఖము దుఃఖము లనునవి చూడ లేవు
తీర్థ మఖములు మంత్రముల్ తెలియ లేవు
అనుభవమ్మది లేదు నా కనుభవించ
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 04
05
న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
చనెడుభయమది లేదింక జాతిలేదు
జనని జనకులు తా లేరు జన్మలేదు
కాను బంధువు నరయంగ కాను సఖుడ
కాను నే శిష్యుడను మరి కాను గురువు
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 05
06
అహం నిర్వికల్పో నిరాకార రూపః
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం
సదామే సమత్వం న ముక్తిర్న బంధః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
లేదు రూపమ్ము చూడగన్ లేదు మార్పు
ఇల ప్రదేశమ్ము లందున యింద్రియముల
వ్యాప్తి చెందియు ననయమ్ము వరలు చుందు
నరయ సమదృష్టి నుందు నే నన్నిటందు
ముక్తి బంధమ్ము లవిలేవు రక్తి లేదు
శివ చిదానంద రూపమౌ శివుడ నేను
శివ చిదానంద రూపమౌ శివుడ నేను 06
అనువాద రచన..
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి