తెలంగాణం.
ప్రకాశపు కాంతులీడిన ప్రాంతాన
కమ్మిన చీకటిని చీల్చేను సమస్తాన
భారతమాత మోము చిరునవ్వున
ఆ నవ్వు చిందించేది తెలంగాణం.
పాడి పంటల రాశి దేశానికే వాసి
రైతు మోమున సంతోషాల హోలీ
నవ భగీరధుడి అద్బుత సృష్టి
నేల పారేను జలసిరుల తెలంగాణం.
ప్రజారోగ్యానికి అండగా నిలబడే
ఇంటింట కంటి వెలుగును చూపే
అడుగడుగునా సంక్షేమ ఫలం
ప్రజారాజ్యము మన తెలంగాణం.
ఆడబిడ్డకు అండగా నిలిచే
పుట్టిన శిశువుకి భద్రతా కిట్
పుస్తే సమయాన కళ్యాణ కానుక
మహిళకు భరోసానిచ్చే తెలంగాణం.
సరస్వతి బిడ్డలకు కొండంత అండ
విజ్ఞాన కాంతి విరజిల్లే రాష్ట్రమంత
విలాసిల్లే ఉత్పత్తి, ఉపాధి రంగం
విలక్షణ సంపద తెచ్చే తెలంగాణం.
కళ కళ లాడుతుందీ ప్రాంతం
జల నడకన సిరి మోము వైనం
ఆసాంతం చూస్తుంది యావత్ దేశం
అభివృద్దికి దిక్సూచిగా తెలంగాణం.
పేద ప్రజల ఆత్మ గౌరవ జీవనం
డబుల్ బెడ్రూం ఇచ్చేను నివాసం
ఇరుకు పోయి తెచ్చేను పదిలం
గృహస్తుల ఆనందపు తెలంగాణం.
దళితుల అభివృద్ధికి దళితబంధు
చేతి వృత్తులకు ఆపన్న సాయము
కులమతాల మధ్య సామరస్యము
ఆధ్యాత్మిక ప్రాంతం తెలంగాణం.
కల్లోల కాలంలో రోగాలకు బెదరక
జనం మేలుగాంచి చేసేను సేవన
ధీర్ఘ రోగులకు సి.యం.రిలీఫ్ ఫండ్
సమస్త ఆరోగ్య కాంక్షిచే తెలంగాణం.
మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు
ఊరూరా సాగు నీరు, తాగు నీరు
ప్రతి ఇంట కులాయి నీటి ధారలు
అన్నింట పధకాల తెలంగాణం.
కల్లాల్లో సంతోషాల కనులు
ధరణిన తొలిగేను భూ సమస్యలు
ప్రతి పొలం గట్టును చేసేను భద్రం
నవ వ్యవస్థీకరణతో తెలంగాణం.
రంగమేదైనా ప్రోత్సాహ వైనం
పెరిగేను సాప్ట్వేర్ ఉద్యోగ రంగం
వనరులన్నీ పెంచే ఆదాయం
సంపద పెంచి పంచే తెలంగాణం.
కళలకు కళాకారులకు తోరణం
గానాలకు గాత్రాలకు ఆస్థానం
చిత్రమైన చిత్రాలకు నిలయం
కళామతల్లి సౌధం తెలంగాణం.
కారుచీకటి రోజులు పోయేను
పున్నమి కాంతులు తెచ్చేను
ముప్పై ఒక్క జిల్లాల సముదాయం
అధికార వికేంద్రీకరణ తెలంగాణం.
పాలనలో అభివృద్దే ముఖ్యం
ప్రజాక్షేమమే పాలకుల ధ్యేయం
ఎదురు చూస్తుంది యావత్ దేశం
రాజ్యానికే ఆదర్శం తెలంగాణం.
స్వయం పాలనలో పదేండ్ల రాష్ట్రం
సొంతమయ్యే ఆనంద ప్రాంతం
సౌభ్రాతృత్వ తత్వం సకల జనం
సుజల సుఫల సురక్ష తెలంగాణం.
తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలతో...
సాహిత్య దినోత్సవం.
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
9391456575,
33-54, టి.యస్.ఆర్ నగర్,
బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్
బాలాపూర్ మండలం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి