🎻🌹🙏 శ్రీకాకుళం జిల్లా మందస గ్రామం వాసుదేవ పెరుమాళ్ళ...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿మందస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు మండలం.
🌸 దాదాపు 800 ఏళ్ల క్రితం నాటి ఆలయం. కళింగ శైలిలో నిర్మించబడిన ఆలయం. ఆలయంలోని మూర్తి మాత్రం తిరుమల శ్రీనివాసుని పోలి ఉంటుంది.
ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాల క్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది.
🌿 ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతంగా ఉంటే, ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి మాత్రం తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది.
🌸గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి. శ్రీకాకుళం నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది మందస గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ప్రశాంతమైన వాతావరణం... వీటి మధ్యలో ఉంది మందస గ్రామం.
🌿పూర్వం ఈ మందస గ్రామాన్ని 'మంజూష' అని పిలిచేవారు.
‘మంజూష’ అంటే నగలపెట్టె అని అర్ధం. అలాంటి గ్రామంలో కొలువుతీరాడు ' మందస వాసుదేవ పెరుమాళ్ స్వామి ఆలయం'
🌸 ఆలయంలోని మూర్తి కంచి క్షేత్రంలో తయారు చేయించి తెచ్చిన మూలమూర్తి. ఈ ఆలయం కొన్ని కోణాల్లో ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాధ ఆలయాన్ని గుర్తు చేస్తే కొన్ని కోణాల్లో కోణార్క్ దేవాలయాన్ని జ్ఞాపకం చేస్తుంది.
🌿ఆలయం శిల్పకళ నిర్మాణం ఒరిస్సా
సంప్రదాయాన్ని గుర్తు చేస్తే, ఇక ఆలయం పేరు వింటే ఎక్కడో తమిళ దేశంలో ఉంది అనుకుంటాం.
కాని ఈ ఆలయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న గ్రామం
🌸 పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం ముమ్మరంగా జరిగేదట.
వైష్ణవానికి పెట్టింది పేరుగా సమస్త వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత ఫలితాన్నిస్తుందని చెప్తారు.
🌹 చరిత్ర 🌹
🌿ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసులు ,ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రములను పొంది ఉన్నారట.
🌸 వీరి ప్రసిద్ధిని గురించి తెలుసుకున్న చినజియ్యర్ స్వామివారు 1988లో ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించారు.
🌿తన గురువూ ఆధ్యాత్మిక మార్గదర్శీ అయిన పెద్దజీయర్ స్వామివారు స్వయంగా విద్య అభ్యసించిన క్షేత్రం కావడంతో పెద్దజీయర్ వారి శతాబ్ది ఉత్సవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగుచేయించారు చినజీయరు స్వామివారు.
🌸వందల ఏళ్లనాటి ప్రాచీనతకూ, శిల్పకళా చాతుర్యం ఎక్కడా చెడకుండా ఆలయ పునర్నిర్మాణం జరిగింది. శిధిలమయిన ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి 2009 ఫిబ్రవరి నెలలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.
🌿 ఈ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి ఒక కథనాన్ని చెప్తారు. పూర్వం ఇక్కడి సంస్థానాధీశులు కొన్ని కారణాల వల్ల బ్రహ్మహత్యా దోషానికి గురయ్యారు.
🌸ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటం కోసం, ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
కాంచీపురంలో వాసుదేవ పెరుమాళ్
విగ్రహాన్ని తయారుచేయించి ఆలయంలో ప్రతిష్ఠించారు.
🌿 కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి అయ్యి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది.
సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది.
🌸 1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామి వారు ఆలయ సందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు.
🌿అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్ని పునర్నిర్మింపచేసారు.
🌸 గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.
🌿 శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది.
🌸 జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఒడిషా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి.
🌿 ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక సందర్శించ తగినది... స్వస్తి..🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి