పాపం-పుణ్యం
(ఈ వ్యాసం వ్రాయటానికి ముందు నేను ఒకింత సందేహించాను ఎందుకంటె ఇంత చిన్న విషయాలు మాకు తెలియవా అని మనలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది కేవలం తెలియని వారిని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందని గమనించగలరు)
మనం తరచుగా పాపం-పుణ్యం అనే ద్వంద పదాలను వింటుంటాము, అంటూవుంటాము. కానీ ఇదమిద్దంగా పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అంటే చాలామంది చెప్పలేని స్థితిలో వుంటారు. కానీ ఒక్కటి మాత్రం ప్రతి వక్కరు చెప్పగలరు అదెమంతి పాపం అనేది చెడుకు సంబంధించింది, పుణ్యం అనేది మంచికి సంబంధించింది కాబట్టి మనం పుణ్యం చేయాలి అని మాత్రం అంటారు. ఎవరైనా ఏదయినా కానీ పని చేస్తే పోన్లే వాడి పాపాన వాడే పోతాడు అని మనం అనటం కూడా కద్దు. అంటే మనం ఏమిచేయనవసరం లేదు వాడి పాప ఫలితాన్ని వాడే పొందుతాడు అని కాబోలు ఆలా వాడుకలోకి వచ్చింది. ఏది యెమీయేన ఒక్కటి మాత్రం నిజం పాపం కానీ లేక పుణ్యం కానీ మనం చేసే పనులకు ప్రతిగా వచ్చే ఫలితం అంటే మన కర్మలకు లభించే ఫలితం. అంటే పాప పుణ్యాలకు కారణం కర్మలు అంటే కొన్ని కర్మలు చేస్తే పాపం వస్తుంది అదే విధంగా కొన్ని కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది.
ఒక చిన్న ఉదాహరణ చూద్దాం
1) తల్లి తండ్రులను గౌరవించాలి
2) తల్లి తండ్రులను హింసించాలి.
ఇందులో మొదటి కర్మ చేస్తే పుణ్యం వస్తుందని రెండవ కర్మ చేస్తే పాపం వస్తుందని అందరము ముక్త కంట్టంగా చెపుతాము. కానీ ఎందుకు అంటే మాత్రం చెప్పలేము.
మనం చేసే కర్మలు రెండు రకములు 1) విహిత కర్మలు 2) నిషిద్ధ కర్మలు అంటే మొదటిది చేయవలసిన పనులు లేక చెప్పిన పనులు రెండవది చేయకూడదని చెప్పిన పనులు అని స్థూలంగా అర్ధం. ఇంకా వివరంగా పరిశీలిస్తే విహిత కర్మలు అంటే వేదవిదిత కర్మలు అనగా వేదంలో చేయమని చెప్పిన కర్మలు అదే విధంగా నిషిద్ధ కర్మలు అంటే వేదనిషిద్ద కర్మలు అనగా వెడలు చేయవద్దని చెప్పిన కర్మలు.
వేదాలు అంటేనే కర్మ కాండ అనగా మానవులు ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అని వివరించేవి వేదాలు
మనం అక్కడక్కడ ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులూ పలుకుతూ ఉండటం చూస్తాం అంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అని కదా అర్ధం, అదే మాదిరి నిషిద్ధ కర్మలు కూడా ఇప్పుడు కొంతవరకు మీకు అర్ధం అయ్యిందని నేను అనుకుంటాను.
ఇదంతా చాలా గజిబిజిగా వున్నది ఒక్క మాటలో పాప పుణ్యాలు అంటే ఏమిటో చెప్పలేవా అని మీరు అడగ వచ్చు. ఆలా చెప్పాలంటే
ధర్మాన్ని ఆచరించటం పుణ్యం
ధర్మాన్ని ఆచరించక పోవటం మరియు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించటం పాపం.
ఇప్పుడు ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ధర్మం అంటే ప్రతివారు తానూ ఆచరించవలసిన విధానం. ఇది ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క రీతిగా వుంటూ అందరికి ఒకేరీతిగా ఉంటుంది.
అదెలా అంటే నీ తల్లిదండ్రులను చూసుకొనేది నీ ధర్మం నీవు నీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదనుకో అప్పుడు నేను నీ తల్లిదండ్రులను చూసుకోవటం నా ధర్మం కాదు మరి అది ఏమిటి అంటే దానికి శ్రీ కృష్ణ భగవానులు దానిని పరధర్మం అని స్పష్టం చేసారు. భగవానులు ఎల్లప్పుడూ ప్రతి వారు తన ధర్మాన్నే ఆచరించాలని పరధర్మాన్ని ఆచరించకూడదని పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి