6, ఆగస్టు 2024, మంగళవారం

దేవాలయాలు - పూజలు 2*

 *దేవాలయాలు - పూజలు 2*


సభ్యులకు నమస్కారములు.


హిందు ధర్మంలోనే  దేవాలయాలు అత్యంత ప్రాముఖ్యత కలవి. *దేవానాం దేవస్య వా ఆలయం* అన్నారు మన పెద్దలు.  భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడని, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అనాదిగా వస్తున్న ఒక వాడుక. *భగవత్ అనుగ్రహం, సాక్షాత్కారము కొరకు ప్రతి భారతీయ హిందువు  తపన పడతాడు, తపనపడాలి కూడా*. అందుకే భగవన్మూర్తిని  అవసరమైన చోట ప్రతిష్టించి ఆరాధిస్తున్నాము.... నిబిడీకృతమైన  అర్చామూర్తిగత భగవచ్ఛక్తిని పొందగలుగుతున్నాము .

*అదే* పవిత్ర మరియు మహిమాన్విత స్థలము. అదే దేవాలయము. ఇది భౌతిక  శరీరం (Physical body), మానసిక (Psychic body) మరియు తైజసిక శరీరము (Super conscious body) ను ప్రతిబింబించే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం... *భగవంతుడికి మరియు మానవుడికి ఉన్న ఒక కొక్కి (Link) అని విజ్ఞుల అభిప్రాయం*.


ఆలయాలు అనగానే *నిత్య* సుప్రభాతాలు, అలంకరణలు, అర్చనలు, ధూప, దీప, నైవేద్యాలు, శఠగోపాలు, భక్తులకు అర్చక స్వాముల ఆశీస్సులు, భక్తుల పవిత్ర మరియు ఆనంద వదనాలు అన్ని స్మరణకు వస్తాయి. 


అవుతే, ఈ లాంటి పూజా కార్యక్రమాలు ప్రతి నిత్యం జరుగు ఆనవాయితి లేకుండా వారానికి ఒకసారి, నెలకొక తూరి, అర్ధ సంవత్సరము మరియు సంవత్సరమునకు ఒకసారి పూజాదికాలు నిర్వహింపబడే దేవాలయాలు కూడా *కొన్ని*  మన దేశంలో ఉన్నాయి. ఆలా జరుగడానికి *అక్కడి క్షేత్ర గాథలు, స్థానిక నియమాలు, భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు* గూడా కారణం కావచ్చును. 


*నామ రూప అతీతుడైన ఆ భగవంతుని నామాలతో కీర్తించడం ఎంత ప్రధానమో, సర్వ వ్యాపి అయిన భగవంతుని ఒక ప్రత్యేక స్థలంలో ప్రశాంతంగా అర్చించడం గూడా అంతే అవసరము*.


ఎందుకంటే అర్చారూపంలో స్వయంగా భగవంతుడే మనకు అందుబాటులో ఉన్న అత్యంత భక్త సులభుడు కనుక.


దేవాలయాలలో అర్చక స్వాములు నిర్వహించే పూజలలో అనేక ,సంప్రదాయాలు ఉండడం కూడా శాస్త్ర విహితమే.  


భగవంతుడే స్వయంగా వివిధ ఆగమ శాస్త్రాల్ని మన ఋషులు మునులకు దర్శింపజేశాడు.


కొన్ని పూజా సమయాలు అక్కడి సామాజిక అంశాలపై ఆధారపడి వివిధంగా ఉంటాయి. ప్రాతః మరియు సంధ్యా సమయాలలో పూజా ఉపక్రమణ ఆలయ గర్భ గుడి శుద్ధి, దేవతా ఆహ్వానము, స్తోత్ర పారాయణము, ధూప దీప, హారతులు, నైవేద్యాలు ఈలా షోడశోపచారాలు ఉంటాయి. ఆ తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు, తదనంతరం ఇష్ట ధర్మ కామ్యాభివృద్ధిరస్తు, మనోవాంఛా సంకల్ప సిద్ధిరస్తు లాంటి ఆశీర్వచనాలు భక్తులు పొందుతారు. భగవంతుని మాటగా....


*మాన్యులకు విజ్ఞప్తి*

*దేవాలయము - పూజలు* అను విషయము పై ధారావాహిక రచనా వ్యాసంగము బహు సున్నితమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్యము గల అంశము గనుక , ఈ గ్రూప్ లోని మాన్యులు... ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.

🙏🙏


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: