22, జులై 2021, గురువారం

కవితా శరధి:-

 🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

*దాశరథి-ఘన కవితా శరధి:-

---భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.✍️

~~~~~~~~~

సీసపద్యం:-

************

గూడూరులో పుట్టె కోటికొక్కడు మేటి,

"కోటి రత్నమ్ముల" సాటి యతడు

పది వత్సరమ్ముల వయసున్న తరుణాన

పద్యముల్ వ్రాసిన పండితుండు

పద్యమే తనదైన పదునైన శస్త్రంగ

వాడి,"పాలన" కూల్చె పటువతండు

"అగ్నిధార"ను రాల్చి యా "నిజాము"ది బూజు

కాల్చివేసినయట్టి ఘనుడతండు


తేటగీతి

********

చలనచిత్ర గీతాలను చాల వ్రాసి

"నా తెలంగాణ కోటిరత్నాల వీణ"

యనిన తనకు,మహాకవికి నతులివియె

దాశరథికి ఘన సుకవితా శరధికి🙏🏼

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి