26, జులై 2022, మంగళవారం

ఆదాయపు పన్ను వివరాలను

 మిత్రులందరికీ నమస్కారం.  జూలై నెల వచ్చిందనగానే సంపాదనపరులంతా చేయవలసిన ముఖ్యమైన పని "గడచిన ఆర్ధిక సంవత్సరానికి చెందిన మీ ఆదాయాలను, వాటికి మీరు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలను ఆదాయపు పన్ను శాఖ వారికి రిటర్ను రూపంలో దాఖలు చేయటం.  దానికి ఆఖరు తేది 31 జూలై.  ఇది అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను పోర్టల్లో "యాన్యువల్ ఇంఫర్మేషన్ స్టేటుమెంటు" అని ఒక డాక్యుమెంటును పెట్టారు.  గతంలో 26ఎ.ఎస్. అన్న స్టేటుమెంటు ఉండేది. దానిలో మీ జీతభత్యాలు, మీరు ఉద్యోగులు అయితే డి.డి.ఓ. చేత పేబిల్లుల ద్వారా చెల్లించిన పన్ను వివరాలు మాత్రమే ఉండేవి.  ఆ ఉద్యోగులు బయట బాంకుల్లో కానీ, యితర ఆర్ధిక సంస్థల్లో గాని కొన్ని డిపాజిట్లను గాని, షేర్లు వంటి వాటిలో గానీ పెట్టుబడి పెట్టి, దానిపై వడ్డీని పొందుతున్న వివరాలు బహిర్గతమయ్యేవి కావు.  ఈ సంవత్సరం నుంచి(1921-22) మీరు పోస్టాఫీసుల్లో గాని, బాంకుల్లో గాని దాచుకొన్న మొత్తాలు, వాటిపై మీకు వచ్చిన వడ్డీల వివరాలన్నీ ఈ ఏ.ఐ.ఎస్.(వార్షిక సమాచార నివేదిక)లో కనిపిస్తాయి.  ఉద్యోగస్తులు బాంకుల్లో గానీ, యితర ఆర్ధిక సంస్థల్లో గానీ తమ పేరు మీద పెద్ద మొత్తాలను డిపాజిట్లుగా దాచుకొని పొందే ఆదాయాల మీద కూడా పన్ను కట్టాలన్న విషయాన్ని సాధారణంగా పట్టించుకోరు. దానికి కారణం సాధారణంగా ఆ మొత్తాలు మన చేతికి రావు కానీ మన అక్కౌంట్లలో కలుస్తూ ఉంటాయి.  జీతాల్లో కట్టేసిన టాక్సు మాత్రమే లెక్కలోకి తీసుకొనే వాళ్ళకి, ఈ మొత్తాల మీద కూడా టాక్స్ కట్టాలని ఈ నివేదిక మీకు గుర్తుచేస్తుంది.  మీరు డిపాజిట్లు చేసినప్పుడు యిచ్చిన మీ ఆధార్ నంబర్ ప్రకారం ఆదాయపు పన్ను  విభాగం ఈ స్టేటుమెంటుని తయారుచేసి మీ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ లో ఉంచుతుంది.

మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గత సంవత్సరం తమకు బాంకు డిపాజిట్లపై వచ్చిన వడ్డీలపై టాక్స్ కట్టని వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు.  వాళ్ళు రిటర్న్ ఫాం నింపేటప్పుడు, ఎలక్ట్రానికల్గా మీకు జీతంలో డి.డి.వో. పన్నుగా విరక్కోసిన మొత్తాలే గాక ఎక్కువ పన్ను బాకీ పడ్డట్లుగా కనిపిస్తుంది. ఆ తేడా ఏమిటన్నది తెలుసుకోవాలంటే మీరు ఈ "వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇంఫర్మేషన్ స్టేటుమెంట్) ని చూడాల్సిందే!  ఇది ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఆదాయపు పన్ను శాఖ తయారుచేసిన పోర్టల్ లో కనిపిస్తుంది.  అది కనుక్కొనే విధానం : మీరు పోర్టల్ తెరవగానే "ఫైల్ యువర్ రిటర్న్" అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ పాన్ నంబర్, పాస్ వర్డ్ కొట్టితే   మీ పోర్టల్ తెరుచుకొంటుంది.  అప్పుడు మీకు పైన కొన్ని హెడ్డింగ్ లు వస్తాయి.  అందులో సర్వీసెస్ అన్న హెడ్డింగ్ ని క్లిక్ చేస్తే ఒక వరుసలో ఉన్న లిస్ట్ వస్తుంది.  దానిలో మధ్యలో ఈ ఎ.ఐ.ఎస్. కనిపిస్తుంది.  దాన్ని క్లిక్ చేసి, లోపల వచ్చిన ఎ.ఐ.ఎస్. (AIS) మీద క్లిక్ చేస్తే, 26 ఎ.ఎస్. మాదిరి ఒక స్టేటుమెంట్ వస్తుంది.  దానిలో మీకు జీతంలో కట్ అయిన టాక్స్ తో పాటు, పోపుల డబ్బాలో తప్ప, మీరు బయట దాచుకొన్న మొత్తాలు, ఎక్కడెక్కడ ఎంత దాచారో, దానిపై వచ్చిన వడ్డీలు వివరంగా కనిపిస్తాయి.  అది Income from other sources  (ఇతర మార్గాల ద్వారా ఆదాయాలు) అన్న హెడ్డింగ్ లో కనిపిస్తాయి.  దానితో పాటు ఎక్కడ దాచారో (దబాయించటానికి వీల్లేకుండ)ఆ సంస్థల పేర్లు కూడా వస్తాయి.  ఇది ఈ ఏడాదే పెట్టారు గనుక, చాలా మంది వాటిపై మార్చిలో పన్ను కట్టి ఉండరు. అందువల్ల మార్చిలో పన్ను కట్టని ఈ వడ్డీ మొత్తాల పన్నుపై ఆదాయపు పన్ను వారి రెండు సెక్షన్ల ప్రకారం వాటిపై 1%, 3% వడ్డీలు కూడా కట్టమని ఒక అంకె పేర్కొనబడుతుంది.  ఆ మొత్తాన్ని కూడా self assessment tax head(300) కింద పన్ను(in a challan) బాంకులో  చెల్లించి( బాంకులో  చలాను కాపీ తీసుకోవాలి., ) ఆపైన మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.  ఆ పన్నును కట్టకపోతే, తరువాత దానిపై పెనాల్టీ కూడా చెల్లించవలసి ఉంటుంది.  పాత పెన్షన్ పథకం కింద ఉన్న ఉద్యోగులకు జి.పి.ఎఫ్. అని ఆఫీసులోనే కొంత మొత్తం దాచుకొనే వీలు ఉంది.  కొత్త పెన్షన్ కింద ఉన్న ఉద్యోగులకు 10% జీతం విరక్కోస్తారు గనుక ఈ జి.పి.ఎఫ్. ఉండదు.  వాళ్ళు తప్పని సరిగా బయట బాంక్, పోస్టాఫీసుల్లో కొంత మొత్తాలను దాచుకొంటుంటారు.  వాటిపై వచ్చే వడ్డీని కూడా మార్చిలోగా ఈ నివేదిక ద్వారా తెలుసుకొని, మీ డి.డి.ఒ.కి యిస్తే, దాన్ని కూడా కలిపి వచ్చే ఏడాది మీ పన్నును లెక్క  కట్టి, జీతంలో విరక్కోస్తాడు.  లేదంటే మార్చి తరువాత మీరు పన్నును, పన్నుపై కొంత మొత్తంతో వడ్డీని కూడా కట్టవలసి ఉంటుంది.  అరవై ఏళ్ళ లోపు వారికి సేవింగ్స్ బాంక్ వడ్డీపై 80 టి.టి.ఎ.కింద కేవలం పది వేలు మాత్రమే రిబేటు ఉంటుంది. వారికి ఫిక్సెడ్ డిపాజిట్ల వడ్డీపై ఏమాత్రం రిబేటు ఉండదు. అరవై పై బడ్డ వారికి ఈ రిబేటు ఉండదు.  వారికి మొత్తం డిపాజిట్లపై వచ్చే వడ్డీపై(సేవింగ్స్, ఫిక్సెడ్ డిపాజిట్లపై కలగలిపి) 80 టి.టి.బి.కింద 50,000/- రిబేట్ యిస్తారు. ఈ విషయం స్నేహితులకు తెలియాలని వ్రాసాను.  గమనించగలరు.  రిటర్న్ వేయటానికి ఆఖరి రోజు జూలై 31 మాత్రమే.  ఈ ఏడాది పొడిగింపు లేదు.  గమనించగలరు.  మన పొదుపు మొత్తాలను ప్రభుత్వంతో అనుసంధానించేది  ఆథార్ కార్డ్.


(ఇది మిత్రుల సౌకర్యార్ధం దీనిని పెట్టాను)

కామెంట్‌లు లేవు: