26, జులై 2022, మంగళవారం

ధర్మాకృతి

 ఆకృతి దాల్చిన ధర్మం "ధర్మాకృతి"


సుమారు రెండున్నర వేల సంవత్సరాల క్రితం 72 అవైదిక మతముల దాడుల వల్ల కొనఊపిరితో ఉన్న సనాతన ధర్మాన్ని పరి రక్షించడానికై కైలాస శంకరుడు కాలడి శంకరులుగా అవతరించి కేవలం ముప్పైరెండు సంవత్సరాల చిరు ప్రాయంలో వేదసమ్మతమైన అద్వైత తత్త్వాన్ని ప్రతిష్టించి దేశం నలుమూలలా నాలుగు పీఠాలను స్థాపించి దక్షిణ భారత మోక్షపురి అయిన కంచిలో సర్వజ్ఞ పీఠంగా కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి వారే స్వయంగా అధిష్టించారు.


మరలా 18, 19 శతాబ్దాలలో ప్రజలు అధర్మం, అవైదికం వైపు వెళ్తున్న తరుణంలో మనల్ని రక్షించడానికి ఆ శంకరులే నడిచే దైవంగా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామిగా అవతరించి చిరు ప్రాయంలో కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులుగా వచ్చి శతాయిష్కులై కోట్ల మందిని సన్మార్గం వైపు నడిపి ధర్మపరిరక్షణ చేశారు. చేస్తూనే ఉన్నారు.


అటువంటి పరమాచార్య స్వామితో దాదాపు ముప్పై సంవత్సరాల సాంగత్యాన్ని పొందిన శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రిగారు ధన్యులు. వారు ప్రస్తుతం కంచి కామాక్షి అమ్మవారి ఆలయ శ్రీకార్యం. వారు రాసిన పుస్తకాల్లో “ధర్మాకృతి” చాలా ప్రశస్తమైనది. “కంచి పరమాచార్య వైభవం” పాఠకుల కోసం రేపటి నుండి రోజూ కొంత భాగం ప్రచురించాలని మహాత్ముల సంకల్పం. 


--- అడ్మిన్ టీం


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: