13, జూన్ 2023, మంగళవారం

* సాధకా మేలుకో -6 ఏకత్వ భావన *

 

 * సాధకా మేలుకో -6 ఏకత్వ భావన *

  

గత కండికలో మనం సాధకుడు ఆచరించవలసిన  సమ భావం గురించి   తెలుసుకున్నాము. ఇప్పుడు సాధకుడు అంతకంటే ఉత్కృష్టమైన కఠినమైనది  దాదాపు మోక్షసాధనకు చేరువయినది ఐన ఏకత్వ భావన గురించి తెలుసుకుందాము. 

ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టే ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకునేది ఏమిటంటే తాను వేరు భగవంతుడు వేరు తాను భగవంతుని ఆరాధించాలి అనే భావంతో తన సాధన మొదలు పెడతాడు.  ఆరాధనలో ప్రాధమికంగా మూర్తిపూజ నుండి మొదలు పెడతాడు.  సాధన కొద్దికొద్దిగా వృద్ధి చెందుతున్న కొద్దీ గురువుల సహాయంతో ఆత్మా, పరమాత్మ అనే భావనలోకి వస్తాడు.  తదుపరి తాను దేహాన్ని కాదు దేహంలో నిగుడంగా నిక్షిప్తమయిన దేహిని అనే భావనకు వస్తాడు.  అప్పటినుండి తన సాధన మూర్తిపూజనుండి మారాలి పరమాత్మను తెలుసుకోవాలనే తపనతోటి ముందుకు సాగుతుంది.  ఎప్పుడైతే పరమాత్మా వైపు మనసు మళ్లుతుందో అప్పుడే తెలుసుతుంటాడు పరమాత్మా తప్ప మిగిలినవి అన్ని నిత్యమైనవి కావని అవన్నీ అనిత్యలని తెలుసుకొని నిత్యం, సత్యము, ఆనందము అయిన పరమాత్మా వైపు మనసు మళ్లుతుంది. 

నిత్యానిత్య వివేకము కలిగినతరువాత అనిత్యమైన విషయాలమీద విరక్తి కలుగుతుంది దానినే వైరాగ్యము అని అన్నారు. తరువాత మోక్షాన్ని పొందాలనే కోరిక బలంగా కలుగుతుంది దానికి ముముక్షుకత్వము అని పేరు ముముక్షుకత్వం స్థితిలోకి చేరుకున్న సాధకుడు తదుపరి మోక్షాన్ని చేరుకుంటాడు. 

మోక్షాన్ని చేరుకునే విధిని ఒక దుష్టాంతరంతో వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్వము కన్నప్ప అనే ఒక కిరాతకుడు ఉండేవాడట అతను అడివిలో వున్న ఒక శివలింగాన్ని నిత్యం ఆరాధించేవాడట. తానూ వేటకు వెళ్లి తెచ్చిన మాంసాన్ని ముందుగా శివలింగానికి నివేదించి తరువాత తాను భుజించేవాడట. ఇలా రోజులు గడుస్తున్నాయి.  కొంతకాలం అయినతరువాత అతని కర్మ పరిపక్వ స్థితిని చేరుకున్నాడు.  అప్పుడు పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షిన్చగోరినవాడై శివ లింగంకు వున్నా ఒక కంటినుండి ధారాపాతంగా నీరు కారటం అయ్యిందట.  అది గమనించిన కిరాతకుడైన కన్నప్ప తన దగ్గరవున్న వస్త్రంతో ఆ కన్నీటిని తుడవ ప్రయత్నం చేసాడు కానీ ఏది ఫలించలేదు. చివరకు తన స్వామి కన్ను చెడిపోయినదని భావించి దాని స్థానంలో తన కన్నును పెట్టాలని ఆలోచించి తన వద్దవున్న బాణంతో తన కన్నును పెరికించి లింగంకు నీరు కారే కంటికి అమర్చాడట వెంటనే ఆ కన్ను నీరు కారటం  ఆగినదట. అది చూసిన కన్నప్పకు సంతోషం కలిగింది స్వామి నా కన్ను పోయినా నీ కన్ను బాగుపడిందని ఆనందించాడట.  కానీ అతని ఆనందం క్షణకాలం కూడా వుండలేదు వెంటనే లింగంకు రెండవ కంటిలోనుండి నీరు కారటం మొదలైనదట అయ్యో ఇప్పుడు ఎట్లా అని ఒక నిముషం ఆలోచనలో పడి తరువాత తన రెండవ కన్నును కూడా పీకి స్వామికి సమర్పించాలని నిర్ణయించుకున్నాడట.  కానీ తన రెండవ కన్ను తీసివేస్తే తాను చూసేది యెట్లా అని ఆలోచనలో పడ్డాడు వెంటనే తన కాళీ బొటన వేలితో పరమేశ్వరుని రెండవ కాంతిని పట్టి గుర్తింపుగా చేసుకొని తన రెండవ కంటిని తీసి స్వామికి సమర్పించారట అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై కన్నప్పను దర్శనమిచ్చి తనలో ఐక్యత చేసుకొన్న విషయం మనందరికీ తెలిసిందే. 

సాధారణ భక్తి భావనలో వున్న సాధకుడికి తాను వేరు భగవంతుడు వేరు అని అనుకుంటాడు కాబట్టి శివలింగం కన్నుకు నీరు కారితే తన కన్ను పెట్టాలని అనుకోడు. 

శివలింగమును కాలితో తాకటం అపచారంగా సాధారణ భక్తులు భావిస్తారు. 

కానీ కన్నప్ప శివుడు వేరు తాను వేరు కాదని ఏకత్వ సాధన చేసిన వాడు కాబాట్టి తనను తానువిస్మరించి కేవలం శివుడే సర్వస్వము అనే భావనలోకి వచ్చాడు అదే ఏకత్వం అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ అనే రెండు వుండవు కేవలం పరమాత్మా తత్వమే ఉంటుంది. దీనినే త్వమేవ అహం అనే భావనగా పేర్కొనవచ్చు. 

 ఇంకా విఫులంగా అర్ధంకావటానికి మరొక దుష్టాంతరం చూద్దాము. పూర్వాము ఒక గ్రామంలో ధర్మపాలుడు అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడట వానికి చిన్నప్పటినుంచే దైవచింతన కలిగి ఉండేవాడు తనకు బ్రహ్మజ్ఞ్యానం బోధించగల గురువు ఎవరైనా దొరుకుతారా అని అన్ని చోట్లకు తిరిగి వెతికేవాడట ఆలా వెతుకుతూ వెతుకుతూ ఒక అరణ్య సమీపంలోని ఒక పల్లెకు చేరుకున్నాడు.  అక్కడి వారిని విచారించగా ఆ పల్లెలోని ఒక ఆసామి నాయనా బ్రహ్మ జ్ఞ్యానులు ఎలావుంటారో నాకు తెలియదు కానీ ఈ అరణ్యంలో ఒక పాడుబడిన శివాలయం వుంది అందులో ఒకవ్యక్తి ఉంటాడు అయన ఎటువంటి దుస్తులు ధరించాడు చూడటానికి పిచ్చివానిగా ఉంటాడు ఎవరితోడి మాట్లాడాడు కేవలం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు బహుశా నీవు వెతికే బ్రహ్మ జ్ఞ్యాని ఆయనే ఏమో చూడు నాయనా అనగా ఆహా ఏమి నా భాగ్యము నేను వెతికే సద్గురువు నాకు తారసపడిపోతున్నాడు నాకు తప్పక జ్ఞనబోధ చేస్తాడు అని ఆలోచిస్తూ ఆ శివాలయాన్ని చేరుకున్నాడు. అది ఒక పాడుపడిన దేవాలయం చుట్టూతా చెట్లు చేమలు వుంది అక్కడికి పోవటానికే దుర్లభంగా వుంది కానీ మన ధర్మపాలకునికి అవేమి కనిపించటం లేదు దేవాలయంలో వుండే తన గురువుగారి అతని ముందర కదులాడుతున్నట్టు  అనిపించింది. ఆ చెట్ల మధ్యనుంచి శివాలయాన్ని  చేరుకున్నారు. శివాలయం అంటా దుమ్ము దూళితో కుడి వుంది ఆలయంలో ఎక్కడ మానవ సంచారం ఉన్నట్లు తెలియటంలేదు.  అలాగే గర్భ గుడికి   అక్కడ మసక వెలుతురో ఒక మనిషి పడుకున్నట్లు కనపడించి బహుశా ఆయనే కాబోలు తాను వెతికే సద్గురువు అని తలంచాడు. 

అతనికి చూడగానే ధర్మపాలునికి మతి పోయినట్లయినది ఆయన శివలింగం మీద తన రెండు పాదాలను మోపి పడుకొని వున్నాడు వెంటనే అతని మీద కోపం వచ్చింది ఇదేమిటి సాక్షాత్తు పరమేశ్వరుని లింగం మీద కాళ్ళు మోపి పడుకునేవాడు ఒక మూర్ఖుడు అవుతాడు కానీ సద్గురువు ఎలా అవుతాడు అని అనుకోని అయన దగ్గర నేను జ్ఞ్యాన సముపార్జన చేయటం అటుంచి ముందుగా ఈయనకు నేను దైవ భక్తిని తెలియచేయాలి అని అనుకోని స్వామి మీరు ఏమి చేస్తున్నారో అర్ధం అవుతున్నదా అని అడిగాడు దానికి ఆయన తెలియదు నాయనా పడుకొని వున్నాను నేను ఏమి చేయటం లేదు అని అన్నాడు. 

స్వామీ మీరు శివలింగం మీద మీ పాదాలు మోపి పడుకున్నారు అపచారం, అపచారం అని అన్నాడు. అలానా నాయనా ఈ మసక చీకటిలో చూసుకోలేదు నాకు కళ్ళు సరిగా కనిపించవు శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి వేళ్ళు నాయనా అని అన్నారు ఆయన అలాగే అని అతని కాళ్ళను ప్రక్కన ఉంచినాడు మన ధర్మ పాలుడు 

ఆశ్చర్యం ఆయన కాళ్ళు ఎక్కడ పెట్టాడో అక్కడ ఇంకొక శివలింగం ఉద్బవించింది. అక్కడినుండి ఇంకోచోటికి మరల్చాడు అక్కడకూడా ఇంకో లింగం వచ్చింది అట్లా ఆయన కాళ్ళు ఎన్ని చోట్లకు మార్చినా అన్ని చోట్ల శివలింగాలు పుట్టటం వాటిమీదనై ఆయన కాళ్ళు ఉండటం గమనించి మన ధర్మపాలునికి మతి పోయింది స్వామి తమరు ఎవరు ఈ చిత్రం ఏమిటి తెలియచేయమని  వేడుకున్నాడు. 

అప్పుడు ఆ జ్ఞ్యాని ఇలా న్నారు నాయనా నీవు కేవలం శివలింగంలోనే భగవంతుని చూస్తూవున్నావు అన్ని నేను ఈ జగత్తు మొత్తంలో భగవంతుని చూస్తూవున్నాను ఇప్పుడు చెప్పు నేను నా కళ్ళను శివలింగం లేని చోట యెట్లా పెట్టాలో అని అన్నారు. 

అప్పుడు మన ధర్మ పాలుడు ఆ మహా జ్ఞ్యానికి పాదాక్రాంతుడై తనకు బ్రహ్మ జ్ఞనాన్ని బోధించ వలెనని వేడుకొనినాడు. 

కాబట్టి సాధక మిత్రమా ఎప్పుడైతే సాధకుడు తన సాధనలో ముందుకు వెళతాడో అప్పుడు ఏకత్వం సిద్ధిస్తుంది ఆ సిద్దె మోక్ష సిద్దిగా మన మహర్షులు పేర్కొన్నారు.    

ప్రతి సాధకుడు సదా జాగరూకుడై వుండి విచక్షణతో మెలగాలి సాధన సంపత్తితోమోక్షపదాన్ని చేరాలి.

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

కామెంట్‌లు లేవు: