*పూర్వము తాళికి పసుపుకొమ్ము ఎందుకు జత చేసేవారు...??*
➖➖➖✍️
*పసుపు కి మన సంప్రదాయాలలో విశిష్ట స్థానముంది, పవిత్రతకు చిహ్నము అని మనకందరికీ తెలిసిందే.*
*పసుపులో ‘కర్క్యుమిన్’ అనే రసాయనము ఉండడం వల్ల ఇది ఆరోగ్యపైన కూడా మంచి ప్రభావాన్ని చూపి మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఆడవారి హృదయస్థానాన్ని నిత్యం తాకేలా పసుపుకొమ్మును తాళికి జతచేశారు మన పూర్వీకులు.*
*పసుపు చాలా ప్రభావంతమైన ఏంటీ బేక్టీరియల్, ఏంటీ ఇన్ ఫ్లమేటరీ కూడా, ప్రేగుల్లోని మలినాలను శుద్దిచేసే గుణకారిణి.*
*నొప్పులనూ హరించగల దివ్య ఔషదమని ఏనాడో మన ప్రాచీన ఆయుర్వేద పండితులు పసుపును విరివిగా వాడమని సూచించారు*
*పూర్వము పాము పుట్రా ఇంటిలోకి చేరకుండా కూడా పసుపుని మన గడపలకి రాసే సాంప్రదాయాన్ని పెద్దలు సూచించారు.*
*అందుకే ఆడవారికి ఇన్ ఫెక్షన్లు సోకి కేన్సర్ బారిన పడకుండా పసుపుకొమ్మును తాళికి జతచేశారు. పసుపులోని ఔషద గుణాలను నేటి ఆధునిక సైన్స్ కూడా దృవీకరించింది.*
*చూశారా బ్రదర్స్/సిష్టర్స్ ఎంత గొప్పవి మన సాంప్రదాయాలు మన దేశములో మన జననం జరగడం పూర్వ జన్మ సుకృతం కాదంటారా..?*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి