13, జూన్ 2023, మంగళవారం

ఆచార్య సద్బోధన

 



           *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


*ఐశ్వర్యం శాశ్వతం కాదు!!...* 

```శంకర భాగవత్పాదులవారు అనేక విధాలుగా జనులకు సన్మార్గాలను ఉపదేశించారు...


వారు రచించిన స్తోత్రాల్లో కేవలం దేవతా గుణగణానువర్ణనలే కాకుండా, మనం గ్రహించాల్సిన అనేకానేక విషయాలను పొందుపరిచారు... 


ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారంటే ...


భగవంతా! నాకు కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. 

వాటిని నువ్వు అనుగ్రహించాలని ప్రార్ధించారు, ఆ ప్రార్ధనలు మనందరం ప్రతినిత్యం భగవంతుని ఎదుట చేయాల్సినవి...


ఎందుకు మనిషికి ఇంత అహంకారం? 

ఐశ్వర్యాన్ని చూసుకుని కావచ్చు. 

ఈ ఐశ్వర్యం అంతా మనకు ఎక్కడి నుండి వచ్చింది?

ఇదంతా భగవంతుడి కృప వల్ల వచ్చింది కాదూ? 

ఆయన దయలేనిదే ఇదంతా ఎక్కడుంది? 

మన సామర్థ్యం వల్ల మనం 

ఏ ఒక్కటీ సంపాదించలేం...

ఆయన కృప లేనిదే మన సామర్థ్యం దేనికీ పనికి రాదు, కాబట్టి మనకు వచ్చిన సంపాదన అంతా భగవంతుడి కృప వల్ల వచ్చిందే. 

దాన్ని సద్వినియోగం చెయ్యాలి, 

తప్పు పనులకు ఐశ్వర్యాన్ని ఉపయోగించకూడదు. 

ఎవడైతే తన ఐశ్వర్యాన్ని భగవంతుని సేవకు కానీ, సమాజ సేవకు గానీ ఉపయోగించకుండా కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో అలాంటి వాడు ‘పాపి’ అని వేదం చెబుతోంది.```✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

కామెంట్‌లు లేవు: