13, జూన్ 2023, మంగళవారం

సుమంగళి కోరిన వైధవ్యం:*

 

   *సుమంగళి కోరిన వైధవ్యం:*

               ➖➖➖✍️


```ఒక నాడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓవృద్ధ సువాసిని వచ్చి,స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది.


"స్వామీ ఒకవేళ నాభర్తకు ఏదైనా జరగ రానిది జరిగి ఆయువుచెల్లితే, అదినేను ఉండగానే  జరిగేలా    ఆశీర్వదిoచoడి. నా కన్నా ముoదు,      నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు     అనుగ్రహించండి" అని ఆర్తితో వేడుకుంది.


వెంటనే మహాస్వామివారు చిరునవ్వుతో "అలాగే అవుగాక" అని           దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని నిశ్చేష్టులైపోయారు.


ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారి తో    “స్వామీ!    పెళ్ళి కాక ముందు చేసే నోములూ వ్రతాలు మంచిభర్త రావాలనీ పెళ్ళైన తరువాతచేసే సమస్తపుణ్యకర్మ  లూ        భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో    తను     పుణ్య స్త్రీ గా పోవాలనీ కదా!     మరి    ఈవిడ ఇoత విపరీతమైన కోరిక కోరడమేమిటి? మీరు కూడా అలాగే అని దీవించడం....”అని ఆశ్చర్యoగా అడిగారు.

   

అందుకు స్వామివారు చిరునవ్వుతో... "వారిది అన్యోన్య దాంపత్యం! భర్తమీద వల్లమాలిన ప్రేమ ఆవిడకి.    ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు. వృద్ధా ప్యం మరో బాల్యం అంటారు కదా!    ఈ వృద్ధాప్యంలో   ఆ భర్తకు  ఈవిడే అన్నీ. ఆయన్ని  చoటి పిల్లాడిలా  సాకుతోంది. పైగా  ఆయనకు    జిహ్వచాపల్యo  కాస్తఎక్కువ. మరి ఆవిడే ముందు కాలoచేస్తే ఆయన్నెవరు  చూసుకుoటారు,  ఆయన అవసరాలను పట్టిoచుకునేదేవరు  అని బెoగ ఆ తల్లికి!      అందుకే ఆ కోరరాని కోరిక కోరింది" అని సెలవిచ్చారు.


భర్తకోసం పద్నాలుగేళ్ళు   కారడవులను సైతం లెక్కచేయక  ఆయన తోడిదే    నా స్వర్గం అని సమస్త భోగాలను  త్యజించి ఆయన్ని అనుసరిoచిన సుకుమారియైన రాకుమారి మన సీతమ్మ తల్లి. ఇప్పటికీ అటువంటి    ఎoదరో    మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం.!


  భర్తే తన దైవoగా భావిoచి   "శ్రీవారు" అని పిలుస్తూ        గృహస్థాశ్రమంలోనే తరిoచిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది!వారoదరినీ సీతమ్మవారి అoశగాగాక మరెలా పరిగణిoచగలo?


అందుకే స్వామి వారికి అంతటి అపార కరుణ ఆ తల్లిపై...```



అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్

ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.✍️

https://t.me/paramacharyaVaibhavam

                   

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

కామెంట్‌లు లేవు: