2, మే 2022, సోమవారం

గజానాం మన్దబుధ్ధిశ్చ

 బ్రాహ్మణానాం అనేకత్వం

సర్పాణాం అతి నిద్రత

గజానాం మంద బుద్ధిశ్చ

త్రిభిర్ లోకోప కారిణః!! (లోకోపకారక:)


*గజానాం మన్దబుధ్ధిశ్చ-*

ఏనుగులకు బుధ్ధి (ఆలోచించ గలిగే జ్ఞానం) తక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమిమీద సంచరించే జంతువుల్లోకెల్లా అమితమైన బల సంపద ఏనుగుల సొంతం కానీ సాధారణంగా గోడలనుకూడా తోసుకుని వెళ్ళే శక్తి ఉన్నాకూడా ఒక ఇంటిముందర గేటు మూయబడి ఉంటే అక్కడే నిలబడిచూస్తూ ఉంటుంది. 

అదే బుద్ధిమాన్ద్యం లేకపోతే ఏనుగును ఆపడం ఎవరితరం?….


*సర్పాణామతినిద్రతః-*

పాములు వాటి జీవితకాలంలో సగం పైగా కేవలం నిద్రలోనే గడిపేస్తాయిట, ఆసమయంలో వాటికి వాయువే ఆధారం,

ఒకవేళ ఈ గుణం (అతినిద్ర) వాటికి లేదనుకుందాం. ఇక పరిస్థితి సర్పలోకంలో మనం బ్రతుకుతున్నట్టే ఉంటుంది,

ప్రమాదంకూడా!!?


*బ్రాహ్మణాణామనేకత్వం:-*

విశ్వానికి జ్ఞానం అందింది అంటే అది కేవలం తపస్సంపన్నులయిన, భవిష్యద్ద్రష్టలైన మహర్షుల వలనే, అటువంటి బ్రహ్మజ్ఞానులు

(బ్రహ్మజ్ఞానీ భవేద్బ్రాహ్మణః)

అనేకరకములైన బ్రాహ్మణాలను

(పరాశరస్మృతి, శౌనకస్మృతి…) వారివారి దివ్యాను (భూతితో) భవంతో ప్రతిపాదించారు. అనేక రకములైన ఆ జ్ఞానభాణ్డముల వలనేకదా ఈనాటికీ-ఏనాటికైనా తరతరాలుగా జ్ఞానాన్ని పొందుతున్నాము….

ఇవి లోకోపకారములే కదా!!? 🙏

(త్రిభిర్లోకోపకారక:)

మనం చూసే దృక్పథం మార్పు కానీ… ఏవి వేటికి ఉండాలో వాటికి అవి ఉన్నవి!! 


ఇక్కడ  బ్రాహ్మణాణామనేకత్వం అనే పదబంధంలో బ్రాహ్మణులు అనే పదం కులానికి సంబంధించినది కాదు అనీ....జ్ఞాన సంపన్నులయిన మహర్షుల రచనలు బ్రాహ్మణములు అనీ ఈ వ్యాఖ్యని అర్థం చేసుకోవాలి.

కామెంట్‌లు లేవు: