2, మే 2022, సోమవారం

అక్షయ తృతీయ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

            🌷 *శ్రీరామ*🌷                 

అక్షయ తృతీయ అనగా రోహిణి నక్షత్ర యుక్త వైశాఖ శుక్ల తదియ రోజున ఏ పని చేసినా పుణ్యం లేదా పాపం అది అక్షయం గా ఉంటుంది అనేది శాస్త్ర వచనం. ఇంకా అక్షయ తృతీయ గురించి విశేషాలు పురాణాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. 👇👇


అక్షయ తృతీయ రోజు చేయవలసిన పని :

పితృ దేవతా ప్రీత్యర్థం: *ఉద కుంభం దానం*(బిందె లేదా చెంబు)

నారాయణ ప్రీత్యర్థం:

*లక్ష్మి నారాయణ పూజ చేసి, విసనకర్ర, మామిడి పండ్లు,గొడుగు, చెప్పులు, వస్త్రం ఇంకా దక్షిణ*

అవకాశం ఉన్నవారు *స్వయంపాకం* కూడ కలిపి బ్రాహ్మణునకు 

ఇచ్చిన అశేష పుణ్యం లభించును..


పై వస్తువులు ఇచ్చిన వారికి మరణానంతరం యమ మార్గాన చేరే దారి చాలా దుర్గమమైనది ఐతే ఇది ఇచ్చిన వారికి మార్గ మధ్యంలో దాహం తీర్చే సాధనంగా పై దానం ఉపయోగపడును... 🙂 🙂 🙂..

వీలు కుదిరిన వారు చేసి ఉత్తమ ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి....


*జై శ్రీరామ్* 



 ఆధారం: *ధర్మ సింధు* *స్కంద పురాణం* *గరుడ పురాణం*

కామెంట్‌లు లేవు: