*!! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ.!!* >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<< *31.కనకాంగద కేయూర కమని య భుజాన్వితా.........* ఇది పదహారు అక్షరములనామము ఈ నామముతో మనముపరమాత్మ ను భక్తితో నమస్కరించేటప్పుడు. *ఓం.కనకాంగద కేయూర కమని య భుజాన్వితా యై నమః.* అని పలుకవలెను.
*కనకము = బంగారము. అంగదము = భుజమున. కేయూర = భుజముపైధరించు ఆ భరణము,భుజకీర్తి. కమనీయ = కనులకుఆనందము కలిగించు విధముగా. భుజాన్వితా = భుజములపైధరి చి యున్నది*......
అంగదముఅంటే భుజమునధరించే అభరణము. కేయూరము భుజము పైన అంటేచేతిమొదలునుండిధరిం చే అభరణము భుజకీర్తి. అంగజము కేయూరము రెండూఒకే అర్దము వస్తుంది.చేతికి ధరించేఆభ రణాలుఅనిఆతల్లిచేతికిముత్యాలు రత్నాలు,పొదగబడినఅద్భుతమైన కాంతులతోప్రకాశిస్తున్నమణికట్టు, మొచేయి, భుజములమీద ధరించు అభరణములచే వేళ్లు ఉంగరాలచే ప్రకాశిస్తూయున్నది.
మెడ ,బహువులు,కంఠము మిధున రాశి చిహ్నములు. ఈ రాశి ద్విస్వభావ రాశి ద్వందము గా కనపడుచున్న సృష్టి రహస్యము లు,ఈరాశియందుసంకేతింపబడినవి. ముందు,తెలుపబడిన,నామములలోగల,మెడ,మంగళసూత్రములు, ఈనామమున,అంగద,కేయూరము లుతెలుపబడుటలోద్వంద్వముకలిగి,అధిష్టించ బడిన సమన్వయము కలిగిన శ్రీ లలితా దేవిగా అమ్మను అవగాహన చేసుకొనవలెను. శ్రీలలితాదేవీసహస్రనామములయం దు,ద్వంద్వములు, పరస్పర విరుద్ధ ములైన,విషయములయందు,ఏకత్వముప్రతిపాదింపబడినదిఅట్టిఏకత్వమునందు,ద్వందములు,దర్శించుట,మొదలవుతుంది.ఈ నామ ము,ఐశ్వర్యము,మరియూ,జీవరక్షణకు,సంకేతార్థము..
*శివశక్తిరూపాయనమశ్శివాయ.* . *ఓం. ఐం. హ్రీం. శ్రీం శ్రీమాత్రేన మః.* (శక్తిఆరాధనయేచక్రఉపాసన.) . *సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి