జీవిత సారం.. నిస్సారమేనా// అంతర్మథనం
...................................
జీవితాన్ని పండించుకోవడం లోనే సారం.. నిస్సారం ఉందంటారు పెద్దలు. తృప్తి కలిగి ఉండటమే సారవంతమైన జీవితమని జ్ఞానులు చెబుతారు. స్వయం కృషి మాత్రమే చాలంటారు లౌకిక వాదులు. ఇందులో సత్యం ఏదనేది ఎవరూ ఇతమిద్ధంగా చెప్పరు. తెలిసిన వాళ్ళు పెదవి విప్పరు. తెలియని వాళ్ళు తమకు తోచినదే సూక్తుల రూపంలో ఊదర గొడతారు. వీళ్లది ఆచరణ లేని వాదన.. తర్కం. అందుకే చెట్టుకు ఒకరు, పుట్టకు ఒక్కరూ స్వీయ బోధకు లు వెలుస్తుంటారు. జనం మోస పోతూనే ఉంటారు.
జీవితం అంటే జీవించిన కాలం. కాలం దైవాధీనం. అంటే..కాలానికి మనిషి బద్ధుడై ఉండాలి. మన సుకృత, దుష్కృతులను బట్టే జీవిక సాగుతుంది. చివరకు నడిచేది, నడిపించేది, సాధించేది, సాధించ బడేది అంతా సంచిత కర్మల ప్రకారమే జరుగుతుంది. భగవానుడి సంకల్పమే..మన సంకల్పంగా మారి..మన ఉన్నతికి కారణ మవుతుంది. అది మన గొప్పతనంగా అన్వ యించుకుంటే..మన పతనాన్ని కూడా మన సంకల్ప కారణంగానే అన్వయించు కో వాల్సి వస్తుంది. కాబట్టి..జీవి పరిమిత స్వాతంత్రం కలిగిన వాడు మాత్రమేనని, సర్వ స్వతంత్రుడు అయిన దైవ సంకల్పమే ఎప్పటికీ నెరవేరుతుందని, దానిని కష్టమైనా ఇష్టంగానే మనిషి స్వీకరించాలని మన స్ఫురణకు రావాలి. మన అనుభవం ఎవరికీ కొరగాక పోవచ్చు. ఎవరి అనుభవం నుంచి వారే పాఠాలు నేర్చుకుంటారు. ఎవరున్నా లేకున్నా, చివరికి నువ్వు ఉన్నా లేకున్నా..ప్రపంచం ఆగదు. ఇదొక Never ending story. You are one of the spectator. నువ్వొక సాక్షి మాత్రమే. నీకు సాక్షీభూతుడు ఆ పరంధాముడే. హరి ఓం/ ఆదూరి వేంకటేశ్వర రావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి