20, జులై 2022, బుధవారం

మాధుర్యాన్ని

 శ, ష, స  అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.


    *యద్యపి బహునాధీషే*

        *తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*

    *స్వజనః శ్వజనో మా భూత్*

        *సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా  (మన వాళ్ళు) 

అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా


, సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 


సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 


తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి  ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం -కళ్ళని -కల్లు ట

                               శిరీష-షిరీష ట

                                 వేళ-వేల ట

                                 కళ-కల ట

                               పళ్ళు-పల్లు ట

                               కాళ్ళు-కాల్లు ట

ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు.....వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


విదేశాలలో ఉన్న తెలుగు వారు ..చక్కటి భాషా

ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..


కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు -సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి


వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ సుద్ధి

వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది.

వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,

శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు 

నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై  ,భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి🙏

కామెంట్‌లు లేవు: