ॐ श्री शिवानन्दलहरी
శ్రీ శివానన్దలహరీ
SREE SIVAANANDALAHAREE
(श्रीमच्छंकरभगवतः कृतौ)
(శ్రీ శంకరాచార్య విరచితమ్)
(BY SREE AADI SANKARA)
శ్లోకం :89/100
SLOKAM :89/100
नतिभिर्नुतिभिस्त्वमीशपूजा-
विधिभिर्ध्यानसमाधिभिर्न तुष्टः ।
धनुषा मुसलेन चाश्मभिर्वा
वद ते प्रीतिकरं तथा करोमि ॥ ८९॥
నతిభిర్నుతిభిస్త్వమీశ! పూజా
విదిభిర్ధ్యానసమాధిభిర్నతుష్టః I
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ -89
పరమేశ్వరా!
నమస్కారాలచేత,
స్తుతులచేత,
పూజావిధులచేత,
ధ్యానసమాధులచేత నీవు సంతోషించలేదు.
ధనస్సుచేగానీ,
రోకలిచేగానీ,
రాళ్లతోగానీ ఎదుర్కొంటే నీకు ఇష్టమవుతుందా? చెప్పు.
ఆ ప్రకారంగానే స్పందిస్తాను.
Hey, Lord, who rules over the universe!
You seem to become more pleased with bow or with pestle or with stones
than with prostrations or singing of your praise or worship,
Or meditation or Samadhi.
Please tell me which you like most and I will do the same.
అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకోసం తపస్సుచేస్తూ కొండదొర రూపంలో ఎదిరించిన పరమేశ్వరుణ్ణి వింటితో కొట్టినట్లు భారతంలో స్పష్టంగా వర్ణింపబడింది.
రోకలితోనూ, రాళ్లతోనూ పరమశివుణ్ణి ఎదిరించిన భక్తుల చరిత్ర పురాణాలలో ఎక్కడో ఉండియుంటుంది.
ఈ శ్లోకం వైరభక్తి తత్త్వాన్ని నిరూపిస్తోంది.
వైరభక్తితో గూడ పరమాత్మని ఆరాధింపవచ్చు అని ఉపదేశిస్తోంది.
భక్తితో కొందరు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందగా, మరికొందరు శత్రుత్వంతో పొందినట్లు పురాణాలలో ప్రసిద్ధం. అది వైరభక్తి అనిపించుకొంటుంది.
హిరణ్యాక్ష హిరణ్యకశిపులు,
రావణ కుంభకర్ణులు మొదలైనవారు ఆ కోవకు చెందుతారు.
చిరకాలం భక్తితో సేవించడం కంటే శత్రుత్వంతో సులభంగా పరమాత్మ సాయుజ్యాన్ని పొందవచ్చు అని శ్రీమహాభాగవతంలో చెప్పబడింది.
వైరానుబంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరఁగ రాదని తోఁచును
నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్ .
* భక్తుల తనయెడ జేసిన అకార్యాలని వాత్సల్యాన భగవానుడు క్షమిస్తాడు.
https://youtu.be/h8qlcoPKG5o
కొనసాగింపు..
=x=x=x=
సేకరణ, కూర్పు :
రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి