ప్రయాణికుడు:
(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన వ్యాసం. ఇతరులు చదవటం నిషిద్ధం. )
60 సంవస్త్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలి. మీరు పూర్తిగా ప్రయాణసన్నాహాలలోనే ఉండాలి. కొంతమంది అప్పుడే రైల్వేస్టేషనుకి వచ్చి వున్నారు. కొంతమంది స్టేషనుకు వెళ్లే మార్గంలో వున్నారు, కొంతమందికి ఎక్కవలసిం రైలు స్టేషనులో ప్లాటుఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైల్లో కూర్చొని రైలు సిగ్నలుకోసం వున్నట్లుగా భావించాలి. ఏక్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపటం ప్రయాణం మొదలుకావడం జరగవచ్చు . మీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటు కూర్చుంటే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యామో అప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు వంటరిగా వున్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ఈ ప్రయాణంలో కూడా రావచ్చు. కానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావటం అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం.
ఈశ్వరానుగ్రహం:
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అది ఎంతవరకు నిజమో కానీ నేను ఒక్కటి మాత్రం సంపూర్ణంగా విశ్వసిత్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడిమీదకు వెళ్ళదు. అందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారు అని నాకనిపిస్త్తుంది. నిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుంది. కానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి ఆ దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం. అలానే మనం దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి దేముడిని ప్రార్ధించాలి, భగవంతుడా నేను నిత్యం నిన్ను మరువకుండా ఉండేటట్లు నాకు అనుగ్రహాన్ని ఇవ్వు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వు అని కోరాలి. మనం ఏదైనా పరీక్ష వ్రాసేటప్పుడు చివరి గంటకు ముందుగా చివరిగుంట మోగుతుందని తెలపటానికి ఒక సన్నిద్ధ గంటను మ్రోగిస్తారు. అప్పుడు అభ్యర్థి తానూ వ్రాసిన జవాబు పత్రాన్ని పూర్తిగా చూసుకొని సరిచేసుకునే వీలుంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు ప్రయాణం మొదలవుతుందో తెలియనే తెలియదు. కాబట్టి సదా మనం మన చివరి మజిలీకోసం సన్నద్ధులం కావాలి. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఎప్పుడు సన్నిద్ధంగా వుండే విద్యార్థి ఏవిధంగానయితే పరీక్ష చక్కగా వ్రాయగలడో అదేవిధంగా సాధకుడు ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మ జ్యాసలోనే ఉండాలి. సదా నిధి జాసలో వుండే సాధకునికి మోక్షం తప్పనిసరి. నిత్యానందుడైన సాధకునికి ఈ భూమి మీద కావలసింది ఏమి ఉండదు. కేవలం కైవల్యం మినహా. కాబట్టి మిత్రమా ఇప్పుడే లే నీ నిరంతర సాధన మొదలుపెట్టు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి