29, నవంబర్ 2020, ఆదివారం

కార్తిక పూర్ణిమ విశేషం*

 🌹🌾🌺🌷💐🌸🥀

*కార్తిక పూర్ణిమ విశేషం*


*కార్తీక పూర్ణిమ భరణీ నక్షత్రముతో గాని, కృత్తిక నక్షత్రముతోగాని, రోహిణి నక్షత్రముతో గాని కలసి వచ్చినచో ఆ పూర్ణిమ దినమును మహాకార్తికీ యందురు.*


*ఈ యోగమును పరవిద్దగా గ్రహించవలెను.*


*భరణీ నక్షత్రయోగము దేవతలకు కూడ దుర్లభమని భవిష్యత్ పురాణమున గలదు.* 


*కృత్తికా యోగము మహాపుణ్యమని రోహిణీ యోగము దేవతలకు కూడ దుర్లభమని బ్రహ్మపురాణమున గలదు*


*విశాఖ మూడవ పాదములో సూర్యుడు సంచరించు చుండగా, చంద్రుడు కృత్తికా నక్షత్రము మొదటిపాదమందు ఉన్నచో ఆ తిథి చాలగొప్పతనము కలిగి 'మహతీ అని, అందురు.*


*ఆతిధి రోజు చేసిన స్నాన, దానములు అనంతఫలదాయకములు అని విష్ణు పురాణమున గలదు. పూర్ణిమ చతుర్దశీ విద్ద కల్గిఉన్నచో దానిని త్యజించి పరవిద్దతో కూడిన దానిని స్వీకరించవలెను అని స్మృత్యంతరమన కలదు.*


*ఆరు ముహూర్తములతో కలసిన చతుర్దశీ వేధ విశేషము. మూడు ముహూర్తములతో కలసిన వేధ సామాన్యము. ఈ రెండింటిని వదలి పాడ్యమీ వేధ గల్గిన పూర్ణిమను స్వీకరించవలెను.*


*పరదినమున పాడ్యమి మూడు మహూర్తములతో పూర్ణిమ వేధ కల్గిననూ లేక తిథి క్షయము వలన సూర్యోదయము కంటే ముందే పూర్తి యైననూ, అప్పుడు పూర్వదినమునే స్వీకరించవలెను.*            


*తిథి వృద్ధిలో ఉన్నయెడల పూర్వదినమున సూర్యోదయ ఆరంభం నుండి పరదినము సూర్యోదయ అనంతరము వరకు వ్యాపించి యుండి పూర్ణిమ రెండు మహూర్తముల పర్యంతము ఉన్నచో అప్పుడు శుద్దమైన తిథియగుటచేత, పూర్ణతిథి యగుటచేత పూర్వదినమే గ్రాహ్యము*

 

                     *భక్తి*

                    M.s.s.k

కామెంట్‌లు లేవు: