ఒక బ్రిటిష్ కల్నల్ సాబ్ తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా ... నేలబారున ఉన్న నూతిలో పడిపోయారు .... వెంటనే ఎలర్టయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ ని పైకి లాగుతున్నారు .... సచ్చిచెడి కల్నల్ నూతి పై అంచుకొచ్చేసరికి .... నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు .... ఎటెన్షన్ లోకి వచ్చి ... తాడు వదిలేసి కల్నల్ కి సెల్యూట్ చేసేసరికి ... కల్నల్ మళ్ళా నూతిలో పడిపోయాడు ....
ఇలా .... మూణ్ణాలుగుసార్లు .... తాడట్టుకుని
కల్నల్ పైకి రావటం ... ఆయన్ని చూసిన జవాన్లు శాల్యూట్ చేసే పనిలోపడి తాడొదిలేయటం .... దొరగారు మళ్ళా నూతిలో పడిపోటం చూసిన నాలాంటి పెద్దయనొకడు ..... అదికాదుగాని అబ్బాయిలు .... ఈయనకంటే పెద్దపీసర్ని పట్టుకురండయ్యా .... ఆయనయితే .... ఈనగారు బైటికొచ్చినప్పుడు శాల్యూట్ సెయ్యడు .... పని జరుగుద్ది ... అనేసరికి ... ఆ ఐడియా నచ్చిన సిపాయిలు ... బ్రిగేడియర్ ని తీసుకొచ్చారు ....
సైనికుల సాయంతో బ్రిగేడియర్ ... తాడట్టుకుని కల్నల్ ని బయటకు లాగుతున్నాడు .... మొత్తానికి పై అంచుకు చేరిన కల్నల్ ... ఇంక పర్లేదు బయటకొచ్చేస్తాడు అనుకుంటుండగా .... అతను తాడు లాగుతున్న బ్రిగేడియర్ని చూశాడు ..... నిబంధనలంటే ప్రాణమిచ్చే కల్నల్ ... వెంటనే తన పై అధికారికి శాల్యూట్ చేశాడు .... ఇంకేముంది మళ్ళా ఎనక్కి నూతిలోకి పడిపోయాడు .....
ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన బ్రిగేడియర్ .... ఒరే బుర్ర తక్కువ దద్దమ్మల్లారా .... వెళ్లి వాడి బ్యాచ్ మాట్ ఎవడైనా ఉన్నాడేమో చూసి అతణ్ణి పట్రండి .... ఆడైతే .... ఆడూ ఈడూ సేమ్ క్యాడర్ కాబట్టి ఈ శాల్యూట్ ల గోలుండదు ....అని హుకుం జారీ చేశాడు ....
వెంటనే స్పందించిన సైనికులు .... కల్నల్ బ్యాచ్ మేట్ ఎవర్నో వెతికి పట్టుకొచ్చి పాపం కల్నల్ని నూతి నుండి బయటకు తీసేసరికి కథ సుఖాంతం అయ్యిందనుకోండి ....
*నీతి : ఎప్పుడూ మీ బ్యాచ్ మేట్లను మాత్రం మర్చిపోకండి ....* 😂🤣🤪
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి