18, ఆగస్టు 2023, శుక్రవారం

𝕝𝕝శ్లోకం𝕝𝕝

_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

        *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*జామయో యాని గేహాని* 

*శపన్త్యప్రతిపూజితాః౹*

*తాని కృత్యాహతానీవ*

*వినశ్యన్తి సమన్తతః॥*


𝕝𝕝తా𝕝𝕝

ఏ ఇంట్లో  స్త్రీలు మరో స్త్రీని గూర్చి అసభ్యంగా మాట్లాడుతారో, మనసులో ఈర్ష ద్వేషాలతో ఉంటారో.. ఆ ఇంట్లో ఎప్పుడు రోధనలతో నిండి పూర్తిగా నాశనమైపోతుంది.


____________________________


*దహ్యమానాః సుతీవ్రేణ* 

*నీచాః పరయశోగ్నిsనా*

*అశక్తాస్తత్పదం గన్తుం*

*తతో నిన్దాం ప్రకుర్వతే*


*----- _చాణక్య నీతి_ -----*


తా𝕝𝕝

నీచులు పరుల కీర్తిని చూచి ఓర్వలేనివారై అట్టి అసూయ అనే అగ్నికి దహించబడినవారై వారివలే ఉన్నతస్థానమునకు చేరుకోలేక అటువంటి కీర్తిమంతులను నిందించుచుందురు.


 మ్లేచ్ఛులు అంటే ఎవరు? విదేశీయులను మ్లేచ్ఛులు అని ఎందుకు అంటారు?


అసలు సమాధానం ఇచ్చిన ప్రశ్న: మ్లేచ్చులు అంటే ఎవరు? విదేశీయులను మ్లేచ్చులు అని ఎందుకు అంటారు?

'మ్లేచ్ఛులు' అన్న మాటకు రకరకాల అర్థాలున్నాయి. కాలానుగుణంగా అర్థాలు మారుతూ వచ్చాయి. మ్లేచ్ఛ శబ్దానికున్న సాధారణ అర్థాలు విదేశీయుడు, ఆర్య (భారతీయ) సంస్కృతికి భిన్నమైన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగిన వాడు, సంస్కృతం మాట్లాడనివాడు/ అర్థం కాని భాషలో మాట్లాడేవాడు అని. మ్లేచ్ఛ శబ్దం 'మ్లేఛ్' ధాతువునుండి వచ్చింది (మ్లేఛఁ అవ్యక్తాయాం వాచి). అర్థం కాకుండా మాట్లాడే వాడని అర్థం. విదేశీయులు మాట్లాడే భాష అర్థం కాదు కనుక వారిని మ్లేచ్ఛులన్నారు.

బౌధాయనుడు మ్లేచ్ఛ శబ్దాన్ని ఇలా నిర్వచించాడు:

గోమాంస ఖాదకో యస్తు విరుద్ధం బహు భాషతే।

సర్వాఽఽచార విహీనశ్చ మ్లేచ్ఛ ఇత్యభిధీయతే॥


" గోమాంసం తినేవారు, సంస్కృతం కాక పలురకాల వేరే భాషలు మాట్లాడేవారు, మన ఆచారాలను వేటినీ పాటించని వారిని మ్లేచ్ఛులని అంటారు".

రామాయణంలో సుగ్రీవుడు కూడా హిమాలయాలు దాటి, గాంధార దేశం దాటిన తరువాత ఉత్తరాన వచ్చే ప్రాంతాలన్నీ కూడా మ్లేచ్ఛ భూములని వర్ణించాడు.

సంస్కృత భాషనే అయినా ఉచ్చారణ సరిగ్గాలేక అర్థం కాకుండానో, తప్పు అర్థాలు వచ్చేలాగానో మాట్లాడే వారిని కూడా మ్లేచ్ఛులనే అన్నారు. పాణిని వ్యాకరణానికి మహా భాష్యం వ్రాసిన పతంజలి "మ్లేచ్ఛా మాభూమేత్యధ్యేయం వ్యాకరణం" అన్నాడు. మ్లేచ్ఛులు సంస్కృతం నేర్చుకొని మన చరిత్రకు ఏ గతి పట్టించారో చూస్తూనే ఉన్నాము కదా.

కామెంట్‌లు లేవు: