18, ఆగస్టు 2023, శుక్రవారం

కాశీఖండము--3ఆ:48 ప.

 శు భో ద యం🙏

లక్ష్మీ స్తుతి!



అగస్త్యుడు లక్ష్మిని స్తుతించుచున్నాడు


కాశీఖండము--3ఆ:48 ప.

శ్రీనాధమహాకవి.


ఆ.వె

కమలనయన! నీవు కలచోటు సరసంబు /

నీవు లేనిచోటు నీరసంబు / 

కంబుకంఠి! నీవు కలవాఁడు కలవాఁడు / 

లేనివాఁడు నీవు లేనివాఁడు.


ధనం,దానిప్రయోజనం, యీపద్యంలో కవిసార్వభౌమ శ్రీనాధుడు బహు చక్కగా వివరించాడు.


అమ్మా! జగజ్జననీ! ధనలక్ష్మీ!

నీవున్నచోటే సర్వసౌభాగ్యాలకు నెలవు.నీవులేనిచోటు నీరసమే!

(దారిద్యమే) అమ్మా! నీవుకలవాడేకలవాడు. నీవు పుష్కలంగా ఉన్నవాడే ఉన్నవానికిందలెక్క(బ్రతికి యున్నవాడని) నీవు లేనివాడు.లేనివాడే!(మృతప్రాయుడే!నని భావం)


       "లోకంలో వింటూఉంటాం డబ్బుకుకొఱగానివాడు ,డుబ్బుకుకొఱగాడు"-అని;లోకాలోకన నిపుణులైన శతకకారులుకూడాయీవిషయాన్నే భగ్యంతరంగా తెలిపారు.


"ఏనరునకు విత్తముగల

దానరుడుకులీనుడధికుడార్యుండతడే,

ధీనిధి,ధన్యుడు,నేర్పరి,

నానాగుణగణము కాంచనంబున నిలచున్"-అని ఆమాటలు నిజంగదా!


,   ధనం ఉండవలసినదే,కానీ తన్నుతానుమరచునదిగా ఉండరాదు.దానము,భోగము,నాశము,అని మూడవస్థలున్నవి. ఆమూడిటిలో దానము, భోగములే ఉత్తమమైనవి.అట్టిమనుజుడు లోకమున సత్కీర్తిబడయును.


            స్వస్తి!🌷🌷🌷

కామెంట్‌లు లేవు: