*సీసము*
అయ్యనంగ యమ్మరా ఆయనంగనునావు
ఇయ్యనంగనునిల్లు ఈనె యీగ
ఉయ్యనంగ నుడుత ఊ యనగను నూడ
ఎయ్యన ఎలుకరా ఏనె యేరు
ఐయన నైదురా ఒయ్యన నొకటి రా
ఓయన నోషధీ ఔను నౌక
అమ్మహంబుల తోడ నలరారు యచ్చులు
తెలుగును వెలిగించి తేజమేలు.
*ఆ.వె.*
అమ్మ మొదటనేర్పు నమృతమ్ము నాంధ్రమ్ము
నాన్న నోట విన్న మాట తెలుగు
గురువు బోధనమున గొప్ప మాట తెలుగు
దేశ భాష లందు తెలుగు లెస్స.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి