🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 12*
జ్యోతి వెలుగులో నిద్రించే ఉన్నత బాలుడు....
నరేంద్రుడు గాంచే దృశ్యాలు ఎన్నో అంతెందుకు, ప్రతి రోజూ రాత్రిపూట అతడు నిద్రించే విధానమే అత్యద్భుతం. అతడు పడుకొని కళ్లు మూసుకోగానే భ్రూమధ్యం నుండి ఒక జ్యోతి కానవస్తుంది. విభిన్న కాంతులతో కూడుకొన్న ఆ జ్యోతి క్రమంగా విస్త్రతించి ఎట్టకేలకు చెల్లాచెదురవుతుంది. ఆ జ్యోతి వెలుగులు శరీరమంతటా పాలనురుగులాంటి తెల్లని కాంతులీనుతూ ముంచెత్తేది. ఆ కాంతిలో నిద్రిస్తాడు ఉన్నతుడైన ఆ బాలుడు.
కొన్ని సమయాలలో ఒక బాలుడు అతని ఎదుట కనిపించి కాంతి బంతి నొకదాన్ని కాలితో తన్ను తాడు. అది దొర్లుతూ అతని వైపు వస్తుంది. తన ప్రక్కకు రాగానే నరేంద్రుడు దాన్లో లయించిపోతాడు, అంతా మరచిపోవడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో ఆ జ్యోతి వర్ణనాతీతమైన మహాజ్యోతిగా ఉండేది. అతడు దాన్లో ప్రవేశించి అట్లే కరిగిపోయేవాడు.
నిద్ర అన్నది అందరికీ ఇలాగే ఉంటుందని అనుకొనేవాడు నరేంద్రుడు. ఒక రోజు ఒక మిత్రుణ్ణి ఇలాంటి అనుభవం కలుగుతుందా అని అడగనే అడిగాడు. ఆ మిత్రుడు, "లేదు" అని జవాబిచ్చాడు. వెంటనే నరేంద్రుడు,
"పడుకోగానే నిద్రలోకి జారుకోకు. కాసేపు గమనించి చూడు. నువ్వూ జ్యోతిని చూడగలవు" అన్నాడు ఆ మిత్రుడితో ఉపదేశ ధోరణిలో.
అయినప్పటికీ మిత్రుడికి అలాంటి అనుభవం కలుగలేదని విన్నప్పుడు అది ప్రత్యేకించి తనకు మాత్రమే కలిగిన అనుభవమని నరేంద్రునికి అవగతమయింది. తదనంతరం దీనిని గురించి మరెవరితోనూ అతడు ప్రస్తావించలేదు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి