18, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీవిల్లిపుత్తూరు

 108 దివ్యదేశములు 9 శ్రీవిల్లిపుత్తూరు

భగవంతుని చేరడానికి ఆమె ఎంతో శ్రద్ధతో కృషి చేసింది...


🎀మధురై నుంచి 80 కి.మీ. స్వామి వటపత్రశాయి. పెరియాళ్వార్, ఆండాళ్ అవతార స్థలము. విల్లి, పుత్తర్ అను కిరాత రాజులచే నిర్మింపబడుటచే ఈ క్షేత్రమునకు విల్లిపుత్తూర్ అను పేరు వచ్చినది. ఆండాళ్ గురించి అందరికి తెలిసినదే. వటపత్రశాయి సన్నిధి పక్కనే పెరియాళ్వార్ పెంచిన నందనవనం, ఆండాళ్ అవతరించిన స్థలము, ఆండాళ్ ముఖము చూసుకున్న బావి కలవు. వీటి పక్కనే ఆండాళ్ రంగమన్నార్ గరుడాళ్వార్ సన్నిధి ఉన్నది.


🎀గరుడాళ్వార్ అన్నిఆలయాలలో స్వామికి ఎదురుగా ఉంటారు. విశేషం ఏమిటంటే ఈ ఒక్క సన్నిధిలో మాత్రం స్వామికి ఎడమవైపున ఉంటారు. రంగమన్నార్ (శ్రీమన్నారాయణుడు), కుడివైపున ఆండాళ్, ఎడమ వైపున గరుడాళ్వార్ నిలుచున్న సేవ. చూడటానికే రెండు కళ్ళు చాలవు.


🎀మొదట సుప్రభాతం ఆండాళ్ సన్నిధిలో జరుగుతుంది. తరువాత వటపత్రశాయి సన్నిధిలో జరుగుగుతుంది. ఇప్పటికీ ప్రతి రోజు గోదాదేవి ధరించిన తులసిమాల లేక పూలమాలను వటపత్రశాయికి అలంకరిస్తారు. శ్రీవిల్లిపుత్తూర్ నుంచి సంవత్సరానికి రెండు రోజులు గోదాదేవి ధరించిన పూలమాల, బొమ్మ చిలుకలను తిరుపతి వెంకటేశ్వర స్వామికి ధరింపచేస్తారు. బ్రహ్మోత్సవంలో గరుడసేవ రోజు మరియు భోగి పండుగ రోజు.


🎀మిధున మాసంలో (జూన్ 14- జూలై 13) జరుగు ఉత్సవంలో ఆండాళ్ హంసవాహన రూఢులై వేంచేయగా-- రంగమన్నార్, వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసర్, తన్ గాలప్పన్ పెరుమాళ్ళు అందరు గరుడ వాహనంపై వేంచేయుట సేవింపదగినది. కాట్టళగర్, శ్రీనివాసర్, తన్ గాలప్పన్ పెరుమాళ్ళు దగ్గరిలో ఉన్న ఊళ్ళనుంచి వస్తారు.


🎀అండాళ్ రచించిన తిరుప్పావై ౩౦ పాశురాములు ఈ సన్నిధిలోని బంగారు విమానంపై చెక్క బడియున్నవి. ఈ ఆలయ గోపురం ఎత్తు 192 అడుగులు. 12 అంతస్తులు. తమిళనాడు ప్రభుత్వం ఈ గోపురాన్ని వాళ్ళ ప్రభుత్వ చిహ్నంగా ఎంచుకున్నారు.


🎀గోదాదేవికి ఎప్పుడు భగవంతుని ధ్యాసే. శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఆమె ధనుర్మాసంలో భగవంతుని పెళ్లి చేసుకోవాలని వ్రతం ఆచరించినది. వీళ్లు పురాణ పురుషులు. పెళ్లి అంటే భగవంతునిలో ఐక్యం కావడం. ఆమె 30 రోజులు 30 పాశురములతో స్వామిని అర్చించినది. రామాయణంలో ఎంతటి కావ్య శిల్పం ఉన్నదో, తిరుప్పావైలో కూడా అంతటి కావ్య శిల్పం ఉన్నది అని కవులు అంటారు. భగవంతుని చేరడానికి ఆమె ఎంతో శ్రద్ధతో కృషి చేసింది. ధనుర్మాసం 30వ రోజు ఆమె పెళ్లి ముహూర్తం నిర్ణయింప బడినది. 


🎀ధనుర్మాసం 27వ రోజున ఆమె వటపత్రశాయికి, వెంకటేశ్వరస్వామికి, కాలళహర్ పెరుమాళ్ కు, పరమపదంలోని శ్రీ మహా విష్ణువుకు తన వివాహ స్వయంవర విషయమై సందేశం నివేదించింది. తనను పెళ్లి చేసుకొంటే 100 గంగాళాల వెన్న, 100 గంగాళాల అక్కారవడిసెల్ కానుకగా సమర్పిస్తానని కాలళహర్ పెరుమాళ్ళకు మొక్కుకొంది. అక్కారవడిసెల్ స్వామికి చాల ఇష్టం. పాయాసానికి, చక్కర పొంగలికి మధ్యగా ఉంటుంది.


 కెర్లెపల్లి బాలసుబ్రహ్మణ్యం

పుంగనూరుఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https://kutumbapp.page.link/?isi=1598954409

కామెంట్‌లు లేవు: